Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 28 Jun 2022 11:34:00 IST

Prithviraj Sukumaran డైరెక్ట్ తెలుగు సినిమా?

twitter-iconwatsapp-iconfb-icon

ఇతర భాషా కథానాయకులు డైరెక్ట్ సినిమాలు చేయడం ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్. ఆల్రెడీ తమిళ హీరోలు.. దళపతి విజయ్ (Vijay), ధనుష్ (Dhanush), శివకార్తికేయన్ (Shivakarthikeyan) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారి చిత్రాల షూటింగ్స్ కూడా మొదలైపోయాయి.  ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు మరో పరభాషా హీరో కూడా చేరుతున్నాడు. అతడు మరెవరో కాదు పృధ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). మలయాళంలో విభిన్న చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా.. దర్శకుడిగానూ సూపర్ సక్సెస్ అయ్యాడితడు. అలాగే.. నిర్మాణ రంగంలోనూ పృధ్విరాజ్ రాణిస్తున్నాడు. ఈ హీరో త్వరలో తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమాలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 

నిజానికి పృధ్విరాజ్ గతంలో తెలుగులో ‘పోలీస్ పోలీస్’ (Police Police) అనే కాప్ చిత్రంలో విలన్ గా నటించాడు. ‘రోజాపూలు’ (Rojapoolu) ఫేమ్ శ్రీరామ్ (Sriram) హీరోగా అలరించాడు. పృధ్విరాజ్ కెరీర్‌లో డైరెక్ట్ గా నటించిన మొదటి తెలుగు చిత్రం ఇదే. ఇంకా ‘శివపురం (Shivapuram), ఏటీయమ్’ (ATM), రీసెంట్‌గా ‘జనగణమన’(Janaganamana) లాంటి డబ్బింగ్ చిత్రాలతోనూ తెలుగువారికి సుపరిచితు డయ్యాడతడు. అయితే ఈ సారి అతడు హీరోగా తెలుగులోకి డైరెక్ట్ గా అడుగుపెడుతుండడం విశేషం. 

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వారు పృధ్విరాజ్ హీరోగా ఓ భారీ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. ఈ విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. ఇంకా రానున్న రోజుల్లో పృధ్విరాజ్ తన దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్‌ (Mohanlal) తో తీసిన ‘లూసిఫర్ (Lucifer), బ్రోడాడీ (Brodaddy)’ చిత్రాలు దర్శకుడిగా పృధ్విరాజ్ ను మరో మెట్టుపైన నిలిపాయి. ఈ రెండూ సూపర్ హిట్ అవడంతో.. మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని తెరకెక్కించేందుకు అతడికి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మోహన్‌లాల్ హీరోగా ‘లూసిఫర్’ కు ప్రీక్వెల్ ను రూపొందించే సన్నాహాల్లో పృధ్విరాజ్ ఉన్నాడు. దీనికి ‘ఎంపురాన్’ (Emburan) అనే టైటిల్ ను ఖాయం చేశారు. మరి పృధ్విరాజ్ చిత్రాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement