Jul 29 2021 @ 07:56AM

పృథ్వీరాజ్ సుకుమారన్ 'కురుతి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం 'కురుతి'. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మను వారియర్ దర్శకత్వం వహించిన ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు రోషన్ మాథ్యూ, శ్రీందా, షైన్ టామ్ చాకో, మురళి గోపీ, మముక్కోయా, మణికంద రాజన్, నస్లెన్, సాగర్ నవాస్ వల్లిక్కున్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11 నుండి నేరుగా ఓటిటి ప్లాట్‌ఫాం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన 'కురుతి' మే 13, 2021న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా రిలీజ్ పోస్ట్‌పోన్ చేసిన  మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మించారు. మాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. ఇక ఇటీవలే ఓటిటిలోనే రిలీజయిన 'కోల్డ్ కేస్' మూవీతో హిట్ అందుకున్నాడు పృథ్వీరాజ్.