ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-08-20T03:37:22+05:30 IST

క్షణికావేశంలో నేరాలు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న అండర్‌ ట్రయల్‌ ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని కలె క్టర్‌ భారతి హోళికేరి సూచించారు. స్వాతంత్య్ర వజ్రో త్సవాలలో భాగంగా లక్షెట్టిపేట సబ్‌ జైలులో శుక్రవా రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎం దరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, 75 సంవత్సరాలు పూర్త యిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామ న్నారు.

ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
సబ్‌ జైలులో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు 19: క్షణికావేశంలో నేరాలు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న అండర్‌ ట్రయల్‌ ఖైదీలు సత్ప్రవర్తన  అలవర్చుకోవాలని కలె క్టర్‌ భారతి హోళికేరి సూచించారు. స్వాతంత్య్ర వజ్రో త్సవాలలో భాగంగా లక్షెట్టిపేట సబ్‌ జైలులో శుక్రవా రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.  ఎం దరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని,  75 సంవత్సరాలు పూర్త యిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామ న్నారు. నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించ కుండా కుటుంబాలతో మంచి జీవితం గడపాలన్నారు. జైలులో సౌకర్యాలపై జైలర్‌ స్వామిని అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఖైదీలకు పండ్లు పంపిణీ చేశా రు. మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, జైలు సూపరింటెండెంట్‌ తేజావత్‌ స్వామి, సత్యసాయి సేవా సమితి సభ్యులు,జైలు సిబ్బంది పాల్గొన్నారు.  

శ్రీరాంపూర్‌: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధా న్యం  ఇస్తుందని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో  భాగంగా శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలతో కలిసి ప్రారంభించారు.  మాట్లాడుతూ ప్రభుత్వం వజ్రోత్సవాల్లో భాగంగా అనే క కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. పోటీల్లో  18 మండలాలకు చెందిన పాఠశాలల బాల బాలికలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, చెస్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో పాలొ ్గన్నారు. విజేతలైన వారికి కలెక్టర్‌ బహుమతులు అం దజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి,  ఎంఈ వోపోచయ్య, కౌన్సిలర్లు కుమార్‌, మహేష్‌ పాల్గొన్నారు.   

మంచిర్యాల కలెక్టరేట్‌: వయో వృద్ధులపై సేవాభా వంతో వారికి అపన్నహస్తంగా  నిలవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్స వాలలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  ఆనంద నిలయం, అనాథ, వృద్ధాశ్రమంలో  పండ్ల  పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మహనీయుల త్యాగాల ఫలితంగా లభించాయన్నారు. ప్రతి ఇంట్లో భావి తరాలకు మంచి  చెప్పడానికి పెద్ద వారు ఉండాలని, వృద్ధుల అనుభవం నేటి తరాలు గ్రహించాలన్నారు. వారు చూపిన మార్గంలో నడుస్తూ అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.  రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ కంకణాల భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, చిన్నయ్య, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

 

Updated Date - 2022-08-20T03:37:22+05:30 IST