15 ఏళ్లుగా జైలులో ఉన్న భర్త.. ఆ సమయంలో అతడి పిల్లలకు జన్మనిచ్చిన భార్య.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2022-01-23T09:34:21+05:30 IST

అతడు నేరస్తుడిగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 15 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకొని విడుదలైన తరువాత ఇంటికి చేరుకోగా.. అతని భార్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది...

15 ఏళ్లుగా జైలులో ఉన్న భర్త.. ఆ సమయంలో అతడి పిల్లలకు జన్మనిచ్చిన భార్య.. అదెలాగంటే..

అతడు నేరస్తుడిగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 15 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకొని విడుదలైన తరువాత ఇంటికి చేరుకోగా.. అతని భార్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఆ పిల్లలకు తండ్రి అతనే చెప్పింది. ఈ ఘటన పాలస్తీనా దేశంలో జరిగింది.


ఆ ఉగ్రవాది జైల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న అతని భార్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ నలుగురు పిల్లలు తన పిల్లలే అని ఆ ఉగ్రవాది చెప్పాడు. అతడి పేరు రఫత్ అల్ ఖరావి. ఇతడు ప్రమాదకరమైన పాలస్తీనా ఉగ్రవాది. పదిహేనేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. 2006లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు అరెస్టయి జైలు పాలయ్యాడు. గత సంవత్సరం 15 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రఫత్ అల్ ఖరావి ఓ ఛానెల్‌కి ఇంటర్వూ ఇచ్చాడు. అందులో భాగంగానే తాను జైలులో ఉన్న సమయంలో నలుగురు పిల్లలకు తండ్రినయ్యానని పేర్కొన్నాడు. 


రఫత్ జైలులో ఉన్నప్పుడు తన స్పెర్మ్‌ను దొంగచాటు తన భార్యకు పంపేవాడని తెలిపాడు. దీని సహాయంతో వైద్యులు తన భార్య కడుపులో పిండాన్ని ఏర్పాటు చేశారని చెప్పాడు. డైలీ స్టార్ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రవాది రఫత్ తన స్పెర్మ్‌ను ప్యాకెట్లలో ఉంచి బయటకు పంపేవాడు. జైలు సెక్యూరిటీ సిబ్బంది నుంచి రహస్యంగా ఈ పని చేయించుకునేవాడని తేలింది.


Updated Date - 2022-01-23T09:34:21+05:30 IST