prison: స్నేహితుడి మోసంతో లక్నో జైలులో చెన్నైవాసి

ABN , First Publish Date - 2022-08-09T16:06:07+05:30 IST

ఓ స్నేహితుడి ద్వారా నకిలీ ఉద్యోగ నియమాకం(Fake employment contract)తో రైల్వే లో పనిచేయడానికి లక్నో వెళ్ళి అరెస్టయిన తన కుమారుడిని

prison: స్నేహితుడి మోసంతో లక్నో జైలులో చెన్నైవాసి

                                       - విడుదల కోసం తల్లి ఆరాటం


చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఓ స్నేహితుడి ద్వారా నకిలీ ఉద్యోగ నియమాకం(Fake employment contract)తో రైల్వే లో పనిచేయడానికి లక్నో వెళ్ళి అరెస్టయిన తన కుమారుడిని బెయిలుపై విడుదల చేయించేందుకు స్థానిక విల్లివాక్కంకు చెందిన తల్లి దిల్లైవాణి న్యాయపోరాటం చేస్తోంది. విల్లివాక్కం భజనకోవిల్‌ వీధికి చెందిన సూర్యప్రతాపన్‌ బీఈ, ఎంబీఏ చదివి రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో ఐసీఎఫ్‏లో పనిచేస్తున్న మణిమారన్‌ కేంద్ర మంత్రి తనకు బాగా తెలుసని చెప్పి రూ.12 లక్షలు తీసుకుని కొద్ది రోజులైన తర్వాత లక్నో రైల్వేలో టిటీఆర్‌ ఉద్యోగం వచ్చినట్లు నకిలీ(fake) నియామకపు పత్రం, గుర్తింపు కార్డు ఇచ్చాడు. దీంతో సంతోషపడిన సూర్యప్రతాపన్‌ లక్నో వెళ్ళి ఓ రైలులో టికెట్ల తనిఖీ చేస్తుండగా ఆ రైలులో ఉన్న టిటీఆర్‌ గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అక్కడి పోలీసులు సూర్వప్రతాపన్‌ను అరెస్టు చేశారు. నాలుగు నెలలుగా అతడు లక్నో జైలు(Lucknow Jail)లో ఉంటున్నాడు. సూర్యప్రతాపన్‌ తల్లి ఫిర్యాదు మేరకు ఐసీఎఫ్‌ పోలీసులు మోసానికి పాల్పడిన మణిమారన్‌ను అరెస్టు చేశారు. 

Updated Date - 2022-08-09T16:06:07+05:30 IST