విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-18T05:28:11+05:30 IST

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి

మహేశ్వరం: రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉన్న తరుణ ంలో వైద్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపా లిటీలోని జాగృతి డిగ్రీ కళాశాలలో జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్‌, ప్రోగ్రెస్సివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో మహేశ్వరం,కందుకూరు మండలాలకు చెందిన వందమంది ప్రైవేటు కాలేజీల అధ్యాపకులకు నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైద్య, విద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని, కరోనా టీకా దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటలను కొనుగోలు చేయడంలేదని, గోనె సంచులు కూడా సరఫరా చేయడంలేదని ప్రభుత్వంపై మం డిపడ్డారు. కేవీ రంగారెడ్డి ఆధ్వర్యంలో నిజాంను ఎదురించి ప్రజల కోసం చట్టాలు తెచ్చిన ఘనత తెలంగాణ ప్రాంతానికి ఉందని గు ర్తు చేశారు. తెలంగాణ రూ.30లక్షల కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకుందని, రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్మి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, జంగారెడ్డి, ఫౌండేషన్‌ మహేశ్వరం కన్వీనర్‌ ప్రవీణ్‌, జానకిరాం, ధన్‌రాజ్‌గౌడ్‌, మధుసూదన్‌, జంపన్నయాదవ్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:28:11+05:30 IST