Abn logo
Sep 21 2021 @ 00:52AM

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

65వ వార్డులో పర్యటిస్తున్న మేయర్‌ హరి వెంకటకుమారి, కమిషనర్‌ సృజన, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి

గాజువాక, సెప్టెంబరు 20: ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన ఽధ్యేయంగా ముందుకు సాగుతున్నామని జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. సోమవారం జీవీఎంసీ 65వ వార్డు పరిధిలో కమిషనర్‌ సృజనతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలావుండగా వార్డులోని పలు పార్కులు, స్విమింగ్‌ఫూల్‌ల ఆధునీకరణకు అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్‌ అఽధికారులను ఆదేశించారు. పారిశుధ్య సమస్య లేకుండా చూడాలని అఽధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలను విన్నవించగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జోనల్‌ కమిషనర్‌ డి.శ్రీధర్‌, వార్డు కార్పొరేటర్‌ బొడ్డు నరసింహాపాత్రుడు, స్థానిక నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.