గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-29T05:17:52+05:30 IST

గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రాధాన్యం

గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రాధాన్యం
మైల్వార్‌ వద్ద వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

బషీరాబాద్‌, జనవరి 28 : గ్రామాలు, గిరిజన తండాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్‌ మండలంలోని నావల్గ, వాల్యానాయక్‌ తండా, మైల్వార్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.90 లక్షల నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వాల్యానాయక్‌ తండాలో రూ.12.60 లక్షలతో నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే సర్పంచ్‌ శివ్యానాయక్‌తో కలిసి నిర్మిత ప్రాంతమంతా కలియతిరిగి పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ మండలంలోని మైల్వార్‌,-కంసాన్‌సల్లి, నవాల్గ-మైల్వార్‌, కాశీంపూర్‌-బద్లాపూర్‌, గొట్టిగకలాన్‌, కొర్విచెడ్‌, పర్వత్‌పల్లి గ్రామాలలో పాడైన బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మైల్వార్‌, నవాల్గ గ్రామాల్లో అధనంగా రూ.63.29 కోట్లతో మూడు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. కాగా, దామర్‌చెడ్‌ గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ వద్దకు  స్థానిక సర్పంచ్‌ నర్సిరెడ్డి వచ్చి పంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యేను ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ భావన, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రామునాయక్‌, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు రాజక్‌, సర్పంచులు సీమాసుల్తానా, శివ్యానాయక్‌, శంకర్‌రాథోడ్‌, సాబేర్‌, దేవ్‌సింగ్‌, సూర్యనాయక్‌, లాలప్ప, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజుగౌడ్‌, ఇందర్‌చెడ్‌ రాజు, రాజరత్నం, సాయిల్‌గౌడ్‌, పవాన్‌ఠాగూర్‌, రాజన్న, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:17:52+05:30 IST