Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రింటర్‌ కొనుగోలులో పేజీ కాస్ట్‌ కీలకం

కొవిడ్‌ కాలంలో ప్రింటర్‌ కీలకంగా మారింది. ఆఫీసు పనులు, విద్యార్థుల చదువులు అన్నింటికీ ఇదే సెంటర్‌ పాయింట్‌గా నిలుస్తోంది. చీటికి మాటికి బయటకి వెళ్లి ప్రింట్‌ తెచ్చుకోవాలంటే కష్టం. దీంతో ఓ ప్రింటర్‌ కొని పడేస్తే పోలా అనే అభిప్రాయం ఏర్పడింది. 

 

 పీసీతోపాటు ప్రింటర్‌కు ప్రాముఖ్యం ఉంటుంది. కార్యాలయాల్లోనే కాదు ఇంట్లోనూ అవసరార్థం ప్రింటర్లను కొనుగోలు చేస్తున్నారు. 


అయితే ప్రింటర్‌ కొనేటప్పుడు మిగిలిన చాలా అంశాలతోపాటు, ఒక పేజీకి అయ్యే వ్యయాన్నే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కాస్ట్‌ ఫర్‌ పేజీ అంటే ఇక్కడ ప్రింటర్‌ సామర్థ్యం, పేజీ తీసేందుకు అయ్యే ఖర్చు లెక్కలోకి వస్తుంది. ప్రింటింగ్‌ వ్యయం పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంక్‌ టైప్‌, కాట్రిడ్జ్‌ సైజు, ఇంక్‌ వినియోగం తదితరాలు ఉంటాయి. నిజానికి తక్కువ రేటుకు ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. అయితే వాటితో  ప్రింటింగ్‌ కోసం అయ్యే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇంక్‌ కాట్రిడ్జ్‌లు, మెయింటెనెన్స్‌ సేవలు అందించి మరింత రాబట్టుకోవాలన్నది ఆ కంపెనీల దురాలోచన. వారానికి ఏవో కొద్ది పేజీలు తీసుకుంటాం అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే పెద్ద ఎత్తున కాపీలు అంటే అందుకు అయ్యే ఖర్చు పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఒక ఫుల్‌ కాట్రిడ్జ్‌కు అయ్యే వ్యయాన్ని దాంతో వచ్చే పేజీల(దాన్ని తిరిగి నింపవచ్చు)తో భాగించాలి. దానికి పేపర్‌ యావరేజ్‌ కాస్ట్‌ కలిపి ప్రింటింగ్‌ వ్యయాన్ని నిర్ధారించాలి. ఇంటికోసం ప్రింటర్లు తీసుకుంటే సగటు వ్యయం 80 పైసల నుంచి రెండు రూపాయల లోపు ఉండాలని చెబుతున్నారు.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...