ద్వైతాద్వైతము!

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

వేల ఏళ్ల చరిత్ర ఉన్న హిందు మతానికి మూలాలైన సిద్దాంతాలలో ద్వైతం, అద్వైతం ముఖ్యమైనవి. జీవాత్మ- పరమాత్మ వేర్వేరు కాదు.. రెండు ఒకటే అని చెప్పేది అద్వైతం...

ద్వైతాద్వైతము!

వేల ఏళ్ల చరిత్ర ఉన్న హిందు మతానికి మూలాలైన సిద్దాంతాలలో ద్వైతం, అద్వైతం ముఖ్యమైనవి. జీవాత్మ- పరమాత్మ వేర్వేరు కాదు.. రెండు ఒకటే అని చెప్పేది అద్వైతం. మనుషులు తనలోనే బ్రహ్మము ఉన్నాడనే విషయాన్ని గ్రహించి.. సాధన ద్వారా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నించాలని అద్వైతం చెబుతుంది. ద్వైత సిద్ధాంతం- జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనే విషయాన్ని పేర్కొంటుంది. ఉర్థ్వలోకంలో ఉన్న భగవంతుడు పాపపుణ్యాలను లెక్కకట్టి మరుజన్మ కర్మలను నిర్ణయిస్తాడని ద్వైతం చెబుతుంది. ఈ రెండింటినీ సమన్వయపరచి నింబార్కుడు నెలకొల్పిన సిద్ధాంతం ద్వైతాద్వైతం. ఒకే సమయంలో ద్వైతాన్ని.. అద్వైతాన్ని కూడా పాటించాలని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా- రచించిన పుస్తకం- జోస్యుల మనీష రాసిన ద్వైతాద్వైతము.


మన శరీరంలోని గతి శక్తి, స్థితిశక్తిలపై అవగాహన కల్పించటానికి.. వాటిపై నియంత్రణ సాధించి అత్యున్నత స్థితికి చేరటానికి అవసరమైన మార్గాలైన- చక్రాల వివరణ, అధిదేవతల రూపవర్ణన, ప్రార్థనా శ్లోకాలు, వాటి అర్థాలను ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి రోజూ ఇంట్లో పూజ చేసుకొనేవారు- తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన పుస్తకమిది. 

ద్వైతాద్వైతము

రచయిత్రి: జోస్యుల మనీష

వెల : రూ. 600, పేజీలు: 683

ప్రతులకు: 9441208955, 8558899478

Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST