గ్రంథాలయాల్లో స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలి

ABN , First Publish Date - 2021-04-19T06:29:30+05:30 IST

గ్రంథాలయాలకు వచ్చే పాఠకులు ప్రశాంత వాతావరణలో పఠనం కొనసాగించే స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత గ్రం థాలయ నిర్వాహకులదేనని ప్రిన్సిపల్‌ సెక్రటరీ (సెకండరీ ఎడ్యుకేషన్‌) బి. రాజ శేఖర్‌ అన్నారు.

గ్రంథాలయాల్లో స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలి

ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 18: గ్రంథాలయాలకు వచ్చే పాఠకులు ప్రశాంత వాతావరణలో పఠనం కొనసాగించే స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత గ్రం థాలయ నిర్వాహకులదేనని ప్రిన్సిపల్‌ సెక్రటరీ (సెకండరీ ఎడ్యుకేషన్‌) బి. రాజ శేఖర్‌ అన్నారు. స్వచ్ఛ క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం ఎంజీ రోడ్డులోని ఠా గూర్‌ స్మారక గ్రంథాలయాన్ని సందర్శించారు. పాఠకులకు ఏర్పాటు చేసిన మౌ లిక సదుపాయాలు పరిశీలించారు. పాఠకులను సమస్యల గురించి తెలుసుకు న్నారు. పుస్తకాలు, లైబ్రరీలోని విభాగాలు గురించి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కంచర్ల నాగరాజు అధికారులకు వివరించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వీ, పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు డి. దేవానంద రెడ్డి, లైబ్రేరియన్‌-2 ఏ. రామచంద్రుడు పాల్గొన్నారు. అనంతరం సత్యనారాయణపురం, రామకృష్ణాపురం పౌర గ్రంథాలయాలను సందర్శించారు.

Updated Date - 2021-04-19T06:29:30+05:30 IST