చాక్‌పీస్‌ పట్టాల్సిన చేతితో చీపురు

ABN , First Publish Date - 2022-06-30T15:09:56+05:30 IST

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కిష్టయ్య. చీపురుతో క్లాస్‌రూం, బాత్‌రూంలను ఊడుస్తున్నందున ఇతను స్వీపర్‌ అనుకుంటే పొరపాటే

చాక్‌పీస్‌ పట్టాల్సిన చేతితో చీపురు

హైదరాబాద్/నార్సింగ్‌: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కిష్టయ్య. చీపురుతో క్లాస్‌రూం, బాత్‌రూంలను ఊడుస్తున్నందున ఇతను స్వీపర్‌ అనుకుంటే పొరపాటే. ఇతను గండిపేట మండలం బండ్లగూడ కాళికనగర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పాఠాలు చెప్పడం, ఉపాధ్యాయులతో చెప్పించడం ఆయన విధి. కానీ, పాఠశాలలో ఆయా, స్కావెంజర్‌, వాచ్‌మన్‌, స్వీపర్‌ లేకపోవడంతో అన్ని విధులు ఆయనే నిర్వహిస్తున్నారు. చాక్‌పీస్‌ పట్టిన చేతితోనే చీపురు పట్టి శుభ్రం చేస్తున్నాడు.   ఇటీవల బడిబాట నిర్వహించినా పాఠశాల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు తీర్చలేకపోయారు. సమస్యను మున్సిపల్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్‌, కౌన్సిలర్లు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు, ఉపాధ్యాయులు వాపోయారు. బాత్‌రూంలు క్లీన్‌గా లేకుంటే విద్యార్థులు ఎలా ఉపయోగిస్తారని, వారికి రోగాలు వస్తే ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-06-30T15:09:56+05:30 IST