శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా!

ABN , First Publish Date - 2022-04-04T02:03:24+05:30 IST

కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా

శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా!

కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబోయ రాజపక్సకు పంపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో తాజాగా నిరసనలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో దేశంలో ఇప్పటికే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు.


తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని పంపింది. బియ్యం కూడా పంపింది. 

Updated Date - 2022-04-04T02:03:24+05:30 IST