ప్రయోగం ఫలించేనా...?

ABN , First Publish Date - 2022-06-17T17:27:17+05:30 IST

మరో పదినెలలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి కోణంలోను బీజేపీ పట్టు సాధించేదిశగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఉత్తరకర్ణాటక,

ప్రయోగం ఫలించేనా...?

- మైసూరు వైపు బీజేపీ చూపు

- యోగా దినోత్సవానికి ప్రధాని రాక

- రాచనగరిలో పాగా వేయడమే ధ్యేయం


బెంగళూరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): మరో పదినెలలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి కోణంలోను బీజేపీ పట్టు సాధించేదిశగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఉత్తరకర్ణాటక, బెంగళూరు, తీర ప్రాంత జిల్లాలలో పార్టీకు అసాధారణమైన బలం ఉంది. కానీ అనాదిగా జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకే పరిమితంగా ముద్రపడిన మైసూరు ప్రాంతంపై బీజేపీ దృష్టి సారించింది. రెండున్నరేళ్ళ కిందట జరిగిన ఉప ఎన్నికలలో జేడీఎస్‌ కంచుకోటలో నారాయణగౌడ ద్వారా బీజేపీ ప్రవేశించింది. 


- మైసూరు ఎంపీగా ప్రతా్‌పసింహా రెండుసార్లు గెలుపొందినా ఎమ్మెల్యే స్థానాలలో మా త్రం పట్టు సాధించలేక పోతున్నారు. మైసూరు,, చామరాజనగర్‌, మండ్య, హాసన్‌ జిల్లాలు పార్టీకు ఏమాత్రం అనుకూలంగా లేని కారణంగా పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే కారణంతోనే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించారు.

- ఓ వైపు యోగా దినోత్సవాన ప్రధాని పాల్గొనడంతో పాటు రాజకీయంగా నాలుగు జి ల్లాల పరిధిలోను పార్టీ నాయకులు, కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోనే యోగా కేంద్రాలు, విన్యాసకులు అత్యధికంగా ఉం డేది మైసూరులోనే. ఇక్కడ దశాబ్దాల కాలంగా యోగా కేంద్రాలు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిన ఏడాది నుంచే మైసూరులో పాల్గొనేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీకు స్థానిక యోగా సంస్థలు ఆహ్వానించాయి. దాదాపు రెండుసార్లు ప్రధాని మంత్రి మైసూరుకు వస్తారనే ప్రచారం సాగినా ఆతర్వాత రద్దు అయ్యాయి. 

- ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనడం ద్వారా ఇటు రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను చైతన్యం చేయడంతో పాటు ప్రత్యేకించి మైసూరు ప్రాంతానికి పలు హామీలిచ్చే అవకాశం ఉంది. నాలుగు జిల్లాల పరిధిలో బ్రాండ్‌ మోదీని తీసుకెళ్ళేందుకు తీవ్ర కసరత్తు సాగిస్తున్నారు. 

- 20వ తేదీన రాష్ట్రానికి వచ్చే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే రోజు రాత్రికి  మైసూరుకు చేరుకుంటారు. అక్కడ రాత్రి పార్టీకి చెందిన ప్రముఖులతో సమావేశం ఉంటుందని సమాచారం. 21న మంగళవారం  ఉదయం స్థానికులతో కలిసి యోగా దినోత్సవంలో భాగస్వామ్యులవుతారు. పదిగంటలలోగానే కార్యక్రమం ముగియనుంది. 

- ఆ తర్వాత మైసూరు ప్రాంత జిల్లాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో బహిరంగ సభ జరుగనుంది. తద్వారా మైసూరు ప్రాంత జిల్లాలకు గడిచిన ఎనిమిదేళ్ళలో ఎటువంటి సంక్షేమాలు, భారీ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయి. ఎంతమంది లబ్దిదారులకు చేయూత అందిందనేది ప్రకటించనున్నారు. పలువురు లబ్దిదారులతో ప్రధాని నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. 

- ఇలా మైసూరు ప్రాంతంలో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఆప్రాంత ప్రజలలో పార్టీ పట్ల సానుకూలం చేసుకోదలచారు. కాగా మైసూరులో ప్రధానిని ఎవరెవరు కలవాలనేది చర్చ వారం రోజులుగా సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మై మైసూరుకు వెళ్ళి స్వయంగా పరిశీలనలు, ముందస్తుఏర్పాట్ల సభ జరిపారు. దాదాపు పదిరోజుల నుంచి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ మైసూరులోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికలలో మైసూరు ప్రాంతంలో పార్టీ ఎక్కువ సీట్లు సాధించే దిశగా ప్రధానమంత్రి పర్యటన ఉంటుందనే పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాచనగరిలో బీజేపీ చేసే ప్రయోగం విజయం సాధించేనో లేదో వేచి 

Updated Date - 2022-06-17T17:27:17+05:30 IST