పశ్చిమగోదావరి: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) భీమవరం చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Bhiswabhushan harichandan), సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఉన్నారు. నేరుగా సభాస్థలికి మోదీ వెళ్లనున్నారు. కాసేపట్లో అల్లూరి (Alluri) విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఏఎస్‌ఆర్ పార్క్‌లో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆపై అల్లూరి వారసులతో మాట్లాడనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో భీమవరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు భీమవరం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మెగాస్టార్ చిరంజీవి సభాస్థలికి బయల్దేరారు.
ఇవి కూడా చదవండి