అపచారం: సింహాద్రి అప్పన్న చందనాన్ని అపవిత్రం చేసిన అర్చకులు

ABN , First Publish Date - 2022-08-12T00:00:33+05:30 IST

విశాఖపట్నం: సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది. అర్చకులే ఆలయ ఆచారాలను తుంగలో తొక్కారు. స్వామివారికి సమర్పించే చందనాన్ని అపవిత్రం చేశారు. సింహాద్రి అప్పన్ననిజరూపదర్శనం తర్వాత విడతలుగా చందన సమర్పణ చేస్తారు. చివరకు కారాల

అపచారం: సింహాద్రి అప్పన్న చందనాన్ని అపవిత్రం చేసిన అర్చకులు

Vishakapatnam: సింహాచలం (Simhachalam)  అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది. అర్చకులే ఆలయ ఆచారాలను తుంగలో తొక్కారు. స్వామివారికి సమర్పించే చందనాన్ని అపవిత్రం చేశారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం తర్వాత విడతలుగా చందన సమర్పణ చేస్తారు. చివరకు కారాల చందనాన్ని అలంకారప్రాయంగా సమర్పిస్తారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి ఈ కారాల చందనాన్ని సమర్పిస్తారు. అర్చకుడు మైక్‌లో మాట్లాడుతూ స్వామివారికి సమర్పించే సుగంధ ద్రవ్యాలు కలిపారు. చందనంపై నోటి తుంపర్లు పడకుండా వస్త్రం కట్టుకోవడం ఆచారం. అర్చకులు ఆ నియమాన్ని పాటించకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  



Updated Date - 2022-08-12T00:00:33+05:30 IST