Abn logo
Sep 26 2021 @ 23:58PM

అప్పన్నకు ఘనంగా స్వర్ణ పుష్పార్చన

స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తున్న అర్చకులు

సింహాచలం, సెప్టెంబరు 26: వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఘనంగా స్వర్ణ సంపెంగ పుష్పార్చన నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రభాత ఆరాధనలు తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేపి షోడశోపచారాలు సమర్పించారు. ముఖ్య అర్చకుడు నరసింహాచార్యులు నృసింహ అష్టోత్తర శతనామావళి పఠిస్తూ స్వర్ణ సంపెంగలతో అర్చన చేశారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.