నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. పూజారి అరెస్టు

ABN , First Publish Date - 2020-05-10T16:16:42+05:30 IST

తిరువణ్ణామలై జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలయ పూజారిని

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. పూజారి అరెస్టు

చెన్నై : తిరువణ్ణామలై జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలయ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరణి సమీపం దచ్చూర్‌కు చెందిన సుకుమార్‌ (70) ఓదలవాడిలోని జెయినర్‌ ఆలయంలో 25 ఏళ్లుగా పూజారిగా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చిన్నారిని దచ్చూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చేపట్టిన వైద్యపరీక్షల్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలింది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన ఆరణి గ్రామ పోలీసులు, పూజారి సుకుమార్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2020-05-10T16:16:42+05:30 IST