Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికా గ్రాసరీ స్టోర్లలో కూరగాయలు.. టమోటా నుంచి అల్లం వరకు.. రేట్లు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా విషయాలంటే అందరికీ ఇంట్రస్టే..! భూతల స్వర్గంగా పేరుపడ్డ ఆ ప్రపంచంలో మనుషులు జీవన శైలి ఎలా ఉంటుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కచ్చితంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు, వేసుకునే దుస్తులు.. అక్కడి సంప్రదాయాలు.. ప్రజల వ్యవహారశైలి.. ఇలా అనేక అంశాలపై చర్చించుకుంటూ ఉంటాం.  అంతేకాకుండా..అక్కడి విషయాలను ఇక్కడి పరిస్థితులతో పోల్చి చూసుకుని మనదైన అంచనాకు వస్తుంటాం. ఈ క్రమంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు ఇక్కడి కూరగాయలు ధరలు మండిపోతుంటే.. మరి అక్కడ పరిస్థితి ఏంటో అనే సందేహం మనలో చలా మందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. అక్కడ మనకు బంధువులు ఉంటే..వాళ్లు మాట్లాడినప్పుడు కచ్చితంగా మన డౌట్లు వారి ముందు పెట్టేస్తాం. ఇక్కడ టమాటాల ధరలు మండిపోతున్నాయి.. మరి అక్కడ పరిస్థితి కూడా అంతేనా..? అని అడిగేస్తుంటాం. 

ఇక కూరగాయల విషయాన్నే తీసుకుంటే.. అక్కడికీ ఇక్కడికీ మధ్య ధరల విషయంలో కొన్ని తేడాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. భారత్‌లో మనకు కూరగాయలు అన్నీ మార్కెట్లలో అందుబాటులో ఉండటం లేదా బళ్లపై ఇంటి వద్దకే రావడం చూస్తుంటాం.  అక్కడ మాత్రం ఏదైనా కొనుక్కోవాలంటే సూపర్ మార్కెట్లకు వెళ్లాల్సిందే. వాటిల్లో కూరగాయల నిల్వకు అత్యాధునిక పద్ధతులు వినియోగిస్తుంటారు. నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉన్నా పాడవకుండా వారు ఏర్పాట్లు చేసుకుంటారు. అన్నీ ఫ్రిజ్‌లలోనే ఉంటాయి. అంతేకాకుండా.. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. సూపర్ మార్కెట్లకు వెళ్లి ఎంచక్కా మనకు కావాల్సినవి కొనుక్కోవడమే. అయితే.. ఇక్కడ మనం పావుకిలో, అరకిలో, కిలోల లెక్కన కొంటే అమెరికన్లు మాత్రం పౌండ్ల లెక్కన కొంటారు. రెండు పౌండ్లు అంటే దాదాపు ఒక కేజీకి సమానం. ఇక రేట్లు విషయాన్ని పరిశీలిస్తే మాత్రం మనకు కచ్చితంగా కళ్లు బైర్లు కమ్మక మానవు. 

ఉదాహరణకు ఇక్కడ టమాటాలు కిలో 42 రూపాయలు ఉన్నాయంటే అక్కడి ఖరీదు మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఏకంగా 222 రూపాయలు. క్యాబేజీ ఇక్కడ కిలో 21 రూపాయలు అయితే..అక్కడ సుమారుగా 296 రూపాయలు ఉంటుంది. కింద ఉన్న లిస్టుపై ఓ లుక్కే్స్తే...అసలు అక్కడ రేట్లు ఎలా ఉంటాయో మీకు ఓ ఐడియా రావడమే కాకుండా కొన్నింటి ధర చూసి షాకైపోతారు కూడా..

కూరగాయలుహైదరాబాద్‌లో(కిలో ధర రూపాయలలో, సగటున)అమెరికాలో(కిలో ధర రూపాయలలో, సగటున)
క్యారెట్
52 
163 
వంకాయలు
28
444
పాలకూర
రూ.20కి ఐదు కట్టలు
474
కొత్తిమీర 
రూ.10కి ఒక కట్ట 103
క్యాప్సికమ్25 
240
ఆలుగడ్డ 
35
415
టమాటా
42
222
క్యాబేజీ
21
296


చూశారు కదా.. ఇవండీ అక్కడి రేట్లు..! మిగితా కూరగాయల ధరల్లో వ్యత్యాసాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement