పండగ పూట ధరల మంట

ABN , First Publish Date - 2021-10-15T06:47:39+05:30 IST

దసరా, బతుకమ్మ, దీపావళి పండుగలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఏ యేటికి ఆ యేడు అమాంతం పెరుగుతుండడంతో జగిత్యాల జిల్లాలోని మద్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

పండగ పూట ధరల మంట

మధ్య తరగతి ప్రజలకు భారంగా నిత్యావసరాలు 

భగ్గుమంటున్న  ఇంధనం ధరలు 

మళ్లీ వంట గ్యాస్‌ ధర రూ. 15 పెంపు 

 ఆందోళనలో ప్రజలు 


జగిత్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దసరా, బతుకమ్మ, దీపావళి పండుగలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఏ యేటికి ఆ యేడు అమాంతం పెరుగుతుండడంతో జగిత్యాల జిల్లాలోని మద్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగడం తో పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దసరా, దీపావళి, బతుకమ్మ వంటి పండుగలను జరుపుకోవడం భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 సామాన్యుల ఇబ్బందులు ..

జిల్లాలో సుమారు 10,54,000 జనాభా ఉంది. జిల్లా వ్యాప్తంగా గత యేడాది కాలంగా కరోనా కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సుమారు 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులను అధికారులు గుర్తించారు. కొవిడ్‌ నుంచి కోలుకోవడానికి కొందరు రూ. లక్షలను వెచ్చించారు. మరికొందరు కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనా వల్ల  ఉపాధి దెబ్బతినడం, వేతనాలు రాకపోవడం, వ్యాపారాలు ఆగిపోవడం తదితర కారణాల వల్ల ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. దీనికి తోడు కొవిడ్‌ బారిన పడి ఆసుపత్రుల పాలై లక్షలాది రూపాయాలను వెచ్చించారు. కనీసం కూలి పనులు దొరకక, చిరు వ్యాపారులు సైతం తమ వ్యాపారాలు నడవక అవస్థలు ఎదుర్కొన్నారు. కొవిడ్‌ వల్ల ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బం దులను ఎదుర్కొన్న జిల్లా ప్రజలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలు కుంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పప్పుల ధరలు వంద దాటగా, వంట నూనెలు రూ. 150కి చేరుకున్నాయి. రోజంతా కష్టం చేస్తే వచ్చిన డబ్బు అవసరాలకే సరిపోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇందనం ధరల ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు సైతం మండి పోతు న్నాయి. పెరుగుతున్న ధరలను పాలకులు నియంత్రించకపోవడంతో ఏమీ చేయాలో తోచక సతమతమవ ుతున్నారు.

మళ్లీ గ్యాస్‌ ధర పెంపు..

వంట గ్యాస్‌ ధరలు మరోమారు పెరిగాయి. చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం మేరకు ఒక్కో గ్యాస్‌ సిలెండర్‌పై రూ. 15 వరకు ధర పెరగడంతో సిలెండర్‌ ధర రూ. 972కు చేరుకోంది. దీనికి తోడు గ్యాస్‌ ఏజన్సీల నిర్వాహకులు రవాణా, ఇతర ఖర్చుల పేరిట రూ. 30 నుంచి రూ. 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. 

 నిత్యావసర వస్తువుల ధరలు..

రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరిగి ఆకాశానంటుతున్నాయి. గత యేడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉం టోంది. జిల్లాలో గత యేడాది క్రితం కంది పప్పు సుమారు రూ. 85 నుంచి రూ. 90 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 115 నుంచి రూ. 120 వరకు, పెసర పప్పు రూ. 80 నుంచి రూ. 85 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 110 నుంచి రూ. 120 వరకు, వంట నూనె లీటరు రూ. 90 నుంచి రూ. 100 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 145 నుంచి రూ. 150 వరకు ఉంటోంది. సగం నుంచి పాతిక శాతం వరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

  పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు..

జిల్లాలో గత యేడాదితో పోలిస్తే ప్రస్తుతం పెట్రోలు, డిజీల్‌ ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. గత యేడాది అక్టోబర్‌ మాసంలో పెట్రో లు ధర రూ. 84.40 పైసలుండగా ప్రస్తుతం సెంచరీని దాటి రూ. 107 వరకు ఎగ బాకింది. అదేవిదంగా గత యేడాది అక్టోబర్‌ మాసంలో డిజీల్‌ ధర రూ. 77 వరకు ఉండగా, ప్రస్తుతం సెంచరీని దాటి రూ. 100.20 పైసల వరకు పెరిగింది. ఇందనం ధరలు పెరగడం వల్ల వీటి ప్రభావం ఇతర వస్తువుల ధరలపై పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ధరలపై దృష్టి సారించి నియంత్రించాల్సిన అవసరముందని డిమాం డ్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2021-10-15T06:47:39+05:30 IST