ఓడలు బళ్లు... చైనా వస్తువులకు రెక్కలు!

ABN , First Publish Date - 2020-02-09T14:52:53+05:30 IST

రూ. 300కు స్మార్ట్ వాచ్, రూ. 200కు బ్లూటూత్ స్పీకర్, రూ. 100కు టెడ్డీబేర్... ఇలా తక్కువ ధరకు లభించే చైనా వస్తువులకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న...

ఓడలు బళ్లు... చైనా వస్తువులకు రెక్కలు!

న్యూఢిల్లీ: రూ. 300కు స్మార్ట్ వాచ్, రూ. 200కు బ్లూటూత్ స్పీకర్, రూ. 100కు టెడ్డీబేర్... ఇలా తక్కువ ధరకు లభించే చైనా వస్తువులకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా చైనాలోని పలు మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఫలితంగా చైనా వస్తువుల ఉత్పత్తి తగ్గింది. దీంతో వ్యాపారులు చైనా ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేశారు. ఈ విషయమై ఢిల్లీకి చెందిన చైనా వస్తువుల దుకాణదారు మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ‘కొద్ది రోజులుగా చైనా నుంచి వస్తువులు దిగుమతికావడం లేదని, సప్లయి తగ్గిపోవడంతో ధరలు 20 నుంచి 30 శాతం మేరకు పెరిగిపోయాయన్నారు. 


Updated Date - 2020-02-09T14:52:53+05:30 IST