దుర్గతులను నివారించే..దుర్గమ్మ

ABN , First Publish Date - 2022-10-04T05:11:07+05:30 IST

పట్టణంలోని పలు దేవాలయాల్లో శరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం పలు ఆలయాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా అలంరించారు.

దుర్గతులను నివారించే..దుర్గమ్మ
ధర్మవరం సాలేవీధిలో దుర్గాదేవిగా పెద్దమ్మతల్లి

ధర్మవరం, అక్టోబరు 3: పట్టణంలోని పలు దేవాలయాల్లో శరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం పలు ఆలయాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా అలంరించారు. ఆలయాలు భక్తులతోకిక్కిరిసి పోయాయి. ప్రధానంగా దుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవిగా అలంకరించి చండీహోమం నిర్వహించారు. చెన్నకేశవస్వామిఆలయంలో అమ్మవారికి విజయదుర్గాదేవిగా, ఇందిరానగర్‌లో మహాలక్ష్మీదేవి చౌడమ్మగా, సాలే వీధిలో పెద్దమ్మతల్లి దుర్గాదేవిగా, కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ధర్మవరంరూరల్‌: మండలంలోని ఉప్పునేసినపల్లిలో లక్ష్మీకొల్లాపురమ్మ ఆలయంలో సోమవారం దుర్గాష్టమి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. టీడీపీ నా యకుడు భీమినేని ప్రసాద్‌నాయుడు కుటుంబసభ్యులతో కలిసి అమ్మ వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అలాగే నాగలూరులో వెలసిన విజయదుర్గాదేవిని ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. భక్తులు తరలివచ్చి  తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

పుట్టపర్తి: దేవీ శరన్నవరాత్రులలో భాగంగా పుట్టపర్తిలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో వాసవీ మాత సోమవారం దుర్గాదేవిగా దర్శన మిచ్చారు. అలాగే సత్యమ్మ, దుర్గాదేవి, గాయత్రి, పెద్దమ్మ, లక్ష్మీదేవి అల యాల్లో ఆమ్మవార్లు దుర్గాదేవిగా దర్శనిమిచ్చారు.

పుట్టపర్తిరూరల్‌: దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా మండల వ్యాప్తంగా ఆమ్మవారి ఆలయాలు, భక్తులతో కిటకిటలాడాయి, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎనిమిదో రోజు సోమవారం కోవెలగుట్టపల్లిలో దుర్గాదేవి నిజరూప దర్శనమిచ్చారు. మామిళ్ళకుంట లలితాదేవి ఆలయంలో లలితాంబ దుర్గాదేవిగా  దర్శనమిచ్చారు.  కోవెల గుట్టపల్లి దుర్గాలయంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ విదేశీయులు ని ర్వహిస్తున్న చండీహోమాన్ని పూర్ణాహుతితో పరిసమాప్తి చేశారు. బుక్కపట్నం: మండలకేంద్రలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో దుర్గాష్టమి వేడులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  సర్పంచ నాగలక్ష్మీరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి అన్నదానం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు.

బత్తలపల్లి: మండలవ్యాప్తంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓంకారేశ్వరి ఆలయంలో అమ్మవారు, ధర్మవరం రోడ్డులో ఏర్పాటుచేసిన మండపంలో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమి చ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.  

్లకదిరిఅర్బన: దేవి శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో దుర్గాష్ట మి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి మహిషాసురమర్దినిగా, మరకత మహాలక్ష్మీ దేవి శ్రీదుర్గాదేవిగా, కుమ్మరవాండ్లపల్లి మల్లాలమ్మ శ్రీమహిషాసురమర్థినిగా, చౌడేశ్వరీదేవి శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 

ఓబుళదేవరచెరువు: మండల పరిధిలోని తిప్పేపల్లిలో వెలసిన రామలింగ చౌడేశ్వరీదేవి ఆలయం లో విజయదశమి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా  హంపిలోని గాయత్రి పీ ఠాధిపతి దయానందపురి స్వామీజీ విచ్చేస్తారని నిర్వాహకులు తెలిపా రు. ఉదయం అమ్మవారికి అభిషే కాలు, పుష్పలాంకరణ, కశలస్థాపన, 9.30గంటలకు పూల గంపతో ఆలయం చుట్టు ప్రదక్షణ, 11కు చౌడేశ్వరీ దేవి పల్లకి ఆలయ ప్రదర్శన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రముంటుందన్నారు. ప్రత్యేక పూజలతోపాటు, దేవాంగ కులస్థు లు, పరిసర ప్రజలు తరలి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.  


Updated Date - 2022-10-04T05:11:07+05:30 IST