మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా చూడాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-15T06:00:29+05:30 IST

మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా చూడాలి : కలెక్టర్‌

మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా చూడాలి : కలెక్టర్‌
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, మే 14: కామారెడ్డి పట్టణంలోని సాందీపని జూనియర్‌ కళాశాల, మైనార్టీ బాలికల వసతి గృహంలోని ఇంటర్‌ మీడియట్‌ పరీక్ష కేంద్రాలను శనివారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌లను పరిశీలించి పరీక్షలను సజావుగా నిర్వహించాలని, మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని సూచించారు. కాగా శనివారం జిల్లాలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్‌, జూవాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,922 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 6,585 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌సలాం, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీలోని ప్రాథమిక, ఉర్ధూ మీడియం పాఠశాలలను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ శనివారం పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదు లు, వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమ ంలో ఎంఈవో ఎల్లయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్‌ అధికారు లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో స్వచ్ఛంధంగా సేవలందించడం అభినందనీయమని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శనివారం జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గత సెప్టెంబరులో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో 1400 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. వారిని అంగన్‌వాడీ కార్యకర్తలతో గుర్తించి అదనంగా పోషకాహారం అందించడం వల్ల ప్రస్తుతం వారి సంఖ్య 350 మందికి తగ్గిందని తెలిపారు. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందేవిధంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు చూడాలన్నారు. మండలాల వారీగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛంధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు రాజన్న, ప్రతినిధులు నాగరాజుగౌడ్‌, సంజీవారెడ్డి, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-15T06:00:29+05:30 IST