Abn logo
Sep 28 2021 @ 22:52PM

నకిలీ విత్తన ఏజెన్సీలను అడ్డుకోండి

తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నేతలు

ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 28: నకిలీ విత్తన ఏజెన్సీలవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అలాంటి వాటిని అడ్డుకుని వ్యవ సాయరంగాన్ని  ఆదుకోవాలని సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు  మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో తహ సీల్దార్‌ నజీర్‌ అహ్మద్‌ను సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, రైతులు కలిసి  నకిలీ విత్తన ఏజెన్సీ భారత్‌ సీడ్స్‌ పై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశా రు. ఇప్పటికే వ్యవసాయాధికారులు ఆ నకిలీ విత్తన ఏజెన్సీపై చర్య లు తీసుకోక పోవడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విజిలెన్స్‌ అధికారులు వచ్చి భారత్‌ సీడ్స్‌ ఏజెన్సీలో కాలంచెల్లిన విత్తనాలను విక్రయించటాన్ని పసిగట్టి పట్టుకోని కేసులు రాస్తుంటే ఇక్కడ వ్యవసాయ అధికారులు ఏజెన్సీల వద్ద మామూళ్లు తీసుకుంటూ రైతులను నట్టేట ముంచు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులే భారత్‌ సీడ్స్‌ వద్ద ధర్నా చేస్తే వ్యవసాయ అధికారులు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా నకిలీ విత్తనాల తో నష్టపోయిన రైతులకు  ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవడంతోపాటు నకిలీ విత్తన ఏజెన్సీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో రైతు సంఘం నేత రామచంద్రరెడ్డి, సీపీఎం నేతలు శేఖర్‌, రెహమా న్‌, మునిప్రభాకర్‌, సీఐటీయూ పట్టణ కార్యదర్శి విజయ్‌కుమార్‌ లు పాల్గొన్నారు.