‘కార్పొరేట్‌’ దోపిడీని అరికట్టండి’

ABN , First Publish Date - 2021-06-18T05:19:34+05:30 IST

‘కార్పొరేట్‌’ దోపిడీని అరికట్టండి’

‘కార్పొరేట్‌’ దోపిడీని అరికట్టండి’
కలెక్టర్‌ శ్వేతామహంతికి వినతిపత్రం అందజేస్తున్న బీజేవైఎం నాయకులు

మేడ్చల్‌ అర్బన్‌ : కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బండారు పవన్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్వేతామహంతికి  వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందనగానే ఫీజుల దందా షురూ చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులను యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ప్రైవేటు పాఠశాలల్లో 50శాతం మేర ఫీజులు తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ అధ్యక్షతన ఫీజుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు జోగారావు, మధుగౌడ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్యామల, సంతోష్‌, చిత్తరంజన్‌రెడ్డి, రాంబాబు, వెంకట్‌రెడ్డి, అర్జున్‌, నాగరాజు, సాయిబాబ, ఠాగూర్‌, విక్రమ్‌సింగ్‌, శివ, భార్గవి, కల్యాణి, కిరణ్‌, కావేరి, శ్రీధర్‌ ఉన్నారు.

అర్హతలేని డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌ : తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన ఘట్‌కేసర్‌ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బీరెడ్డి స్రవంతి అలియాస్‌ బొక్క లక్ష్మిపై చర్యలు తీసుకొని అనర్హురాలిగా ప్రకటించాలని విండో డైరెక్టర్‌ చందుపట్ల ధర్మారెడ్డి గురువారం కలెక్టర్‌, జిల్లా సహకార సంఘం అధికారికి ఫిర్యాదు చేశారు. 20202 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీరెడ్డి స్రవంతి అంకుషాపూర్‌ సర్వే నెంబర్లు 91ఇ, 92ఈ, 93అ, 102ఇ లలో 1.25ఎకరాల భూమి చూపించి విండో డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. అయితే ఈ సర్వే నెంబర్లలోని భూమిని 2015 మార్చి 17నే అమ్మారని ఫిర్యాదులో వివరించారు. భూమి పాత డాక్యుమెంట్లు చూపించి సహకారం సంఘంలో ఓటు హక్కు పొంది డైరెక్టర్‌ అయ్యారని తెలిపారు. తప్పుడు పత్రాలు ఇచ్చిన బీరెడ్డి స్రపంతి డైరెక్టర్‌ పదవిని రద్దు చేయాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోరారు.

Updated Date - 2021-06-18T05:19:34+05:30 IST