తెలుగు నృత్యకళాకారిణికి ప్రతిష్ఠాత్మక British Citizen Award

ABN , First Publish Date - 2021-10-03T12:58:23+05:30 IST

బ్రిటన్‌లో స్థిరపడ్డ హైదరాబాద్‌కు చెందిన శాస్త్రీయ నృత్యకళాకారిణి రాగసుధ వింజమూరికి ప్రతిష్ఠాత్మక ‘బ్రిటిష్‌ సిటిజెన్‌’ అవార్డు లభించింది.

తెలుగు నృత్యకళాకారిణికి ప్రతిష్ఠాత్మక British Citizen Award

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో స్థిరపడ్డ హైదరాబాద్‌కు చెందిన శాస్త్రీయ నృత్యకళాకారిణి రాగసుధ వింజమూరికి ప్రతిష్ఠాత్మక ‘బ్రిటిష్‌ సిటిజెన్‌’ అవార్డు లభించింది. విద్య, వైద్య, సామాజిక, కళారంగాల్లో సేవ చేసేవారికి ఏటా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈసారి ఈ అవార్డును అందుకున్న 26 మందిలో రాగసుధ ఒక్కరే భారత సంతతి వారు. బ్రిటన్‌లో ఈ గౌరవాన్ని పొందిన తొలి తెలుగు మహిళ కూడా ఆమే. బ్రిటన్‌ పార్లమెంటులోని హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ నటుడు టిమ్‌ విన్సెంట్‌ తనకు అవార్డును ప్రదానం చేశారని రాగసుధ  వింజమూరి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. లండన్‌లోని సండర్‌లాండ్‌ వర్సిటీలో అధ్యాపకురాలైన రాగసుధ ప్రవృత్తిరీత్యా నర్తకి. బ్రిటీష్‌ పార్లమెంటులో ఇప్పటికి పలుసార్లు నృత్యప్రదర్శనలు ఇచ్చారు. 

Updated Date - 2021-10-03T12:58:23+05:30 IST