Abn logo
Jun 30 2020 @ 15:52PM

ఈ హీరోలపై ఒత్తిడి పెరుగుతోందా?

అనుకున్న దాని కంటే చాలా ముందుగానే ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పట్లో థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడం, ఒకవేళ తెరిచినా జనాలు వస్తారనే నమ్మకం లేకపోవడంతో స్టార్ హీరోలు కూడా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలైపోయాయి. బాలీవుడ్‌కు చెందిన కొందరు అగ్ర హీరోలు కూడా ఓటీటీ విడుదలకు ఓకే చెప్పేశారు. 


బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ తమ సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని, రామ్ వంటి హీరోలపై ఒత్తిడి పెరుగుతోందట. ఎప్పుడో షూటింగ్‌లు పూర్తి చేసుకున్న నాని, సుధీర్‌బాబు `వి`, రామ్ `రెడ్` సినిమాలను విడుదల చేయడానికి ఏప్రిల్‌లోనే ఓటీటీ సంస్థలు ముందుకొచ్చాయి. `వి` సినిమా హక్కుల కోసం రూ.30 కోట్లు, రామ్ `రెడ్` సినిమాకు రూ.22 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చాయట. అయితే థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయంతో అప్పుడు వీరు అంగీకరించలేదు. అయితే పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే ఆశలు కనిపించకపోవడంతో ఈ సినిమాలను ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు అంగీకరించాల్సిందిగా హీరోలపై ఒత్తిడి పెరుగుతోందట. 

Advertisement
Advertisement
Advertisement