Presidential Electionsకు సర్వం సిద్ధం.. అసెంబ్లీలో ఓటు వేయనున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-07-18T01:43:28+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‎లో టీఎర్ఎస్ ఎమ్మెల్యేల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు...

Presidential Electionsకు సర్వం సిద్ధం.. అసెంబ్లీలో ఓటు వేయనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల (presidential elections) నేపథ్యంలో తెలంగాణ భవన్‎ (Telangana Bhavan)లో టీఎర్ఎస్ ఎమ్మెల్యేలు (Trs Mlas) బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు మాక్ పోలింగ్ (Mock Polling) నిర్వహించనున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ రోజు రాత్రి వరంగల్‎లోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం వరంగల్ (Warangal) నుంచి నేరుగా అసెంబ్లీ (Assembly)కి చేరుకుని  సీఎం కేసీఆర్ ఓటు వేయనున్నారు. సీఎం కేసీఆర్‎తో పాటే వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ (Trs) మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకే ఓటు వేసే అవకాశం ఉంది. 



Updated Date - 2022-07-18T01:43:28+05:30 IST