మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సీజేఐ నివాళులు

ABN , First Publish Date - 2021-10-02T19:52:02+05:30 IST

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్

మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సీజేఐ నివాళులు

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు నివాళులర్పించారు. గాంధీజీ కలలను సాకారం చేస్తామని శపథం చేయాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలను కోరారు. 


రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన ట్వీట్‌లో, గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయులందరికీ ఈ రోజు గాంధీ సంఘర్షణలు, త్యాగాలను స్మరించుకునే ప్రత్యేకమైన రోజు అని చెప్పారు. గాంధీ బోధనలు, ఆదర్శాలు, విలువలకు కట్టుబడి ఉంటూ, ఆయన కలలుగన్న భారత దేశాన్ని తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తామని ప్రజలు శపథం చేయాలన్నారు. 


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్‌‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు. శాంతి దూతగా, అహింసావాదిగా గాంధీజీని ప్రపంచం గౌరవిస్తోందన్నారు. 


సీజేఐ

 జస్టిస్ ఎన్‌వీ రమణ కూడా గాంధీజీకి నివాళులర్పించారు. వర్చ్యువల్ కోర్టులు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ కాలేకపోయాయన్నారు. 

న్యాయం సామాన్యులకు అందేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పారు. 

మారుమూల ప్రాంతాలు, అత్యంత బలహీనవర్గాలకు న్యాయం జరగాలన్నారు. 

దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో న్యాయసేవలు అందాలన్నారు.


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించారు. 


Updated Date - 2021-10-02T19:52:02+05:30 IST