Dussehra 2022: ముర్ము, ధన్‌కర్, మోదీ, రాహుల్ దసరా శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-05T20:23:29+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధాన

Dussehra 2022: ముర్ము, ధన్‌కర్, మోదీ, రాహుల్ దసరా శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 






ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఇచ్చిన ట్వీట్‌లో, విజయ దశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అవినీతిపై నీతి, అసత్యం మీద సత్యం, చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా దసరా ఉత్సవాలను జరుపుకుంటామన్నారు. ఈ పండుగ దేశ ప్రజలందరి జీవితాల్లోనూ సమృద్ధి, సుఖశాంతులను తీసుకురావాలని ఆకాంక్షించారు. 


ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) ఇచ్చిన ట్వీట్‌లో, సంతోషకరమైన దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హ‌ృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నానని తెలిపారు. చెడుపై మంచి విజయం సాధిస్తుందనే అంశం ధర్మం పట్ల మన నమ్మకాన్ని మరింత పెంచుతుందని తెలిపారు. ఈ పండుగ మనందరి జీవితాల్లోనూ సంతోషం, శాంతిసౌభాగ్యాలను తీసుకురావాలన్నారు. 




ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన ట్వీట్‌లో, దసరా పండుగ అంటే విజయానికి గుర్తు అని తెలిపారు. విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ చాలా చాలా అభినందనలు అని తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ సాహసం, సంయమనం, సకారాత్మక శక్తులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 




కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇచ్చిన ట్వీట్‌లో, విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం విజయం సాధిస్తాయని చెప్పే ఈ పండుగ అందరి జీవితాల్లోనూ నూతన శక్తిని, ప్రేరణను నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్ అని పేర్కొన్నారు. 




కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. విద్వేషం నిండిన లంక మండిపోవాలని, హింసాత్మకంగా ప్రవర్తించే మేఘనాథుడు అంతమవాలని, అహంకారం నిండిన రావణాసురుడు అంతం కావాలని, సత్యం, న్యాయం గెలవాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ విజయ దశమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 



Updated Date - 2022-10-05T20:23:29+05:30 IST