President Election Results: బాబోయ్ అంత మెజార్టీనా.. 1,886 ఓట్లలో ద్రౌపది ముర్ముకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

ABN , First Publish Date - 2022-07-21T23:36:55+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో (President Election Results) ఎన్డీయే (NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) భారీ మెజారిటీ దిశగా..

President Election Results: బాబోయ్ అంత మెజార్టీనా.. 1,886 ఓట్లలో ద్రౌపది ముర్ముకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో (President Election Results) ఎన్డీయే (NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. తొలి రౌండ్‌లో ఆధిక్యాన్ని కనబర్చిన ముర్ము తాజాగా వెలువడిన ఫలితాల్లో కూడా అదే జోరును కొనసాగించారు. తాజాగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకూ లెక్కించిన 1,886 ఓట్ల విలువ 6,73,175 కాగా.. వీటిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 1,349 ఓట్లు పోలయ్యాయి. ఆమెకు పోలయిన ఓట్ల విలువ 4,83,299. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు (Yashwant Sinha) 537 ఓట్లు పోలయినట్లు తెలిసింది. ఆయనకు పోలయిన ఓట్ల విలువ 1,89,876. ఆల్ఫాబెటికల్‌లో పది రాష్ట్రాల ఓట్లను లెక్కించిన క్రమంలో ముర్ము భారీ ఆధిక్యం కనబర్చారు. ఎన్డీయే పెట్టుకున్న అంచనాలకు మించి భారీ మెజార్టీతో ముర్ము గెలిచే అవకాశం ఉందని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఆమె విజయం దాదాపు ఖాయం కావడంతో ముర్మును నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోదీ, సీనియర్ కేంద్ర మంత్రులు వెళ్లనున్నట్లు సమాచారం.



ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఖాయమని భావించిన ఆమె స్వగ్రామానికి చెందిన ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దాదాపు 70 శాతానికి పైగా ఓట్లు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా పోలయినట్లు స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ.. రెండు పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-07-21T23:36:55+05:30 IST