ప్రారంభమైన President Election పోలింగ్.. ఓటు వేసిన మోదీ

ABN , First Publish Date - 2022-07-18T16:00:06+05:30 IST

రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్(Parliament) సహా

ప్రారంభమైన President Election పోలింగ్.. ఓటు వేసిన మోదీ

New Delhi : రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్(Parliament) సహా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియగించుకుంటున్నారు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్(Secret Ballet Voting) విధానంలో పోలింగ్ జరుగుతోంది. ఎంపీలకు ఆకుపచ్చ(Green), ఎమ్మెల్యేలకు గులాబీ(Pink) రంగు బ్యాలెట్ పత్రాలు(Ballet Papers) ఇవ్వనున్నారు. 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి(Electoral College) సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నెంబర్ 63లో 6 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. 

Updated Date - 2022-07-18T16:00:06+05:30 IST