మంత్రి కేటీఆర్‌కు ఓటరు జాబితాల అందజేత

ABN , First Publish Date - 2021-02-25T05:08:54+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు ఓటరు జాబితాల అందజేత

మంత్రి కేటీఆర్‌కు ఓటరు జాబితాల అందజేత
మంత్రి కేటీఆర్‌కు ఓటర్‌ లిస్టును అందజేస్తున్నరోహిత్‌రెడ్డి

వికారాబాద్‌/ తాండూరు/వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి)/ శామీర్‌పేట/ పరిగి/ కులకచర్ల/కొడంగల్‌/తాండూరు/ఘట్‌కేసర్‌ రూరల్‌ : హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించిన వికారాబాద్‌ నియోజకవర్గ ఓటరు జాబితాలను బుధవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి,  మెతుకు ఆనంద్‌ అందజేశారు. ఈసందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదులో వేగంపెంచాలని, రెండురోజుల్లో సభ్యత్వం నమోదు పూర్తి చేసి ఆన్‌లైన్‌ చేయించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణకి సంబంధించి నియోజకవర్గంలో శనివారం సమావేశం నిర్వహించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌ పటేల్‌కేటీఆర్‌ చేతుల క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డినివాసంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పూర్తయిన పుస్తకాలను శామీర్‌పేట మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీ్‌షగౌడ్‌అందజేశారు. 

పేదల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

 సీఎం కేసీఆర్‌ పేదల అభ్యున్నతికోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మునిసిపల్‌తోపాటు, మండల పరిధిలోని రంగంపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొని చేయించారు. కార్యక్రమంలో అశోక్‌, బి.హరిప్రియ,  అరవింద్‌,  శ్యాంసుందర్‌రెడ్డి,  ఆంజనేయులు, సత్యనారాయణ పాల్గొన్నారు. కులకచర్ల మండల పరిఽధి  మక్తవెంకటాపూర్‌, మందిపాల్‌, కుస్మసముద్రం గ్రామాల్లో జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, నర్సింహులు, సర్పంచ్‌లు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. కొడంగల్‌ 2వ వార్డులో కౌన్సిలర్‌ మధుయాదవ్‌ ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని  ఇంటింటికి తిరిగి అందజేశారు. తాండూరు పట్టణంలోని 9వవార్డులో బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు ఇంటింటికి వెళ్లి సభ్యత్వాన్ని అందజేశారు.  ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఓరుగంటి వెంకటేష్‌ గౌడ్‌ ప్రారంభించి పలువురికి సభ్యత్వాలు అందజేశారు. కార్యక్రమంలో కందుల రాజు, వార్డుసభ్యులు దయ్యాల ఆంజనేయులు, ఎరుకల దుర్గరాజుగౌడ్‌, మాజీ సర్పంచ్‌ కవితావెంకటే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.




Updated Date - 2021-02-25T05:08:54+05:30 IST