హరితహారానికి సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-20T05:11:54+05:30 IST

హరితహారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఏడు విడుతలగా విజయవంతం అయిన స్ఫూర్తితో ఎనిమిదవ విడతకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

హరితహారానికి సన్నద్ధం
కొత్తపల్లి నర్సరీలో హరితహారానికి సిద్దంగా ఉన్న మొక్కలు

- ఎనిమిదవ విడతకు ఏర్పాట్లు

- జిల్లాలో 10.20లక్షల 

మొక్కలు నాటడమే లక్ష్యం

- ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలు 


గద్వాల, మే 19: హరితహారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఏడు విడుతలగా విజయవంతం అయిన స్ఫూర్తితో ఎనిమిదవ విడతకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలలో జూన్‌, జూలైలో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నది. హరితహారం మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. గ్రామ గ్రామాన వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేసింది. ఏడు విడుతలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 8వ విడుతలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నాటేందుకు సిద్ధం అవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 10.20లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక లను సిద్ధం చేశారు.

ఉపాధి హామీ పథకంలో....

ఉపాధి హామీ పథకంలో గుంతలను తీసి మొక్కలు నాటేందుకు మండలాలకు టార్గెట్‌లను అందించారు. 255 గ్రామ పంచాయతీలలో 6.6లక్షల మొక్కలను ప్లాంటేషన్‌ చేయడం ద్వారా మరో 3 నుంచి 6లక్షల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా లక్ష్యా న్ని చేరాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. ఉపాధి పథకం ద్వారా నాటే మొక్కలపై గ్రామాల వారిగా పంచా యతీ కార్యదర్శులకు టార్గెట్‌లు ఇస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచి మొక్కలు నాటేందుకు గుంతలను తీసే బాధ్యతను అప్పగించారు. అదే విధంగా ఇంటింటికి పంపిణీ చేసే గులాబీ, మం దార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరు డు, మునగ, కానుగ, తులసి మొక్కల పంపిణీపై గ్రామంలో అవగాహన కల్పించి ప్రతీ ఇంటికి మొక్కలను అందించి నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతలను అప్పగించే విధంగా  చూడాలని కార్యదర్శులకు సూచిస్తున్నారు.

నాలుగు మునిసిపాలిటీలలో 1.46లక్షల లక్ష్యం

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో హరిత హారం కింద దాదాపు 1,46,760మొక్కలు నాటేందు కు ప్రణాళిక ఇచ్చారు. అందులో గద్వాల మునిసి పాలిటీలో 60వేలు, అయిజలో 38.400, వడ్డేపల్లిలో 26,400, అలంపూర్‌లో 21,960మొక్కలు నాటాలని నిర్ణయించారు. వర్షాలు ప్రారంభం అయిన వెంట నే మొక్కలు నాటడం ద్వారా త్వరగా జీవం పోసు కొని బతికే అవకాశం 90శాతం ఉంటుందని అందుకే జూన్‌ మొదటి వారంలో హరితహారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

కార్యాలయాల వారిగా టార్గెట్లు:

జిల్లాలోని 45 ప్రభుత్వ కార్యాలయాలను కూడా హ రితహారంలో భాగస్వాములను చేశారు. ప్రతి ఏడాది హరితహారంలో వారు కూడా మొక్కలు నాటడమే కా కుండా సంరక్షింస్తున్నారు. అందులో ప్రధానంగా ఫారె స్టు డిపార్ట్‌మెంటుతో పాటు, విద్యాశాఖ, ఎక్సైజ్‌శాఖ, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటు, ఆర్‌డబ్ల్యూఎస్‌, పం చాయతీరాజ్‌, హార్టీకల్చర్‌ డిపార్ట్‌మెంటు, వ్యవసా య శాఖ, పోలీస్‌శాఖ, హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్స్‌, ఎండోమెం టు, మిషన్‌ భగీరథ ఇలా దాదాపు 45శాఖలకు 1.30 లక్షల మొక్కలు నాటేందుకు ప్లానింగ్‌ ఇచ్చారు. వారు వారి శాఖల పరిధిలోని కార్యాలయాలు, స్థలాలలో హరి తహారం నిర్వహించడంతో పాటు మొక్కలను సంరక్షిం చే బాధ్యతను తీసుకుంటున్నారు.


వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

 కలెక్టర్‌ ఆదేశాల మేరకు హరితహారం ఏర్పాట్లు పూర్తి చేశాం. మాకిచ్చిన లక్ష్యాన్ని  వందశాతం పూర్తి చేస్తాం. వర్షాలు సకాలంలో కురిసే అవకాశం ఉన్నందున్న ఆ లోపే  గుంతలను తీసి మండలాలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయిస్తాం. ఇప్పటికే అన్ని నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.

- ఉమాదేవి, డీఆర్‌డీవో పీడీ గద్వాల 

Updated Date - 2022-05-20T05:11:54+05:30 IST