సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-06-20T04:43:07+05:30 IST

సకాలంలో వర్షాలు పడటంతో రైతన్న ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నాడు.

సాగుకు సన్నద్ధం
ట్రాక్టర్‌తో పొలంలో దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్న దృశ్యం

రాజుపాళెం, జూన్‌ 20: సకాలంలో వర్షాలు పడటంతో రైతన్న ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే పంట పొలాన్ని దుక్కిదున్ని చదును చేసి సాగుకు సిద్ధంగా ఉంచారు. జూలై మొదటి వారం నుం చి ఆగస్టు చివరి వారం వరకు పత్తి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గతేడాది అధిక వర్షాలు పడి పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాదైనా వర్షాలు సకాలంలో పడితే పంట దిగుబ డి వచ్చేందుకు బాగుంటుందని రైతులు పేర్కొంటు న్నారు. రాజుపాళెం మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉండగా  27 వేల ఎకరాలు సాగు భూ మి ఉంది. అందులో పది వేల ఎకరాలకుపైబడి పత్తి పంట సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధమవుతు న్నట్లు తెలుస్తోంది. పత్తి పంటకు గిట్టుబాటె ధర ఉండడంతో మండలంలోని రైతులు పత్తిపంట సాగుపై మొగ్గుచూపుతున్నారు. 

 సబ్సిడీకి పత్తి విత్తనాలు అందించండి

ఖరీఫ్‌ పంట సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై  పత్తి విత్తనాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పంట సాగు సమయంలో రైతులు విత్త నాల కోసం ఉరుకులు పరుగులు పెట్టకుండా సకాలం లో సబ్సిడీతో విత్తనాలు అందించి ఆదుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉంది. వర్షం పదునైన వెంటనే రైతులకు పత్తి విత్తనాలను సబ్సిడీ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల రై తులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరు తున్నారు. అదే విధంగా ఎరువులు కూ డా సకాలంలో ప్రతి రైతుకు అందే విధంగా అధికారులు చొరవ తీసుకోవా లని రైతులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-06-20T04:43:07+05:30 IST