హరితహారానికి మొక్కలు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-26T04:04:51+05:30 IST

ఏటా హరితహారంలో నాటుతున్న మొక్కలు పెరిగి వృక్షాలుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదో విడత హరితహారానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

హరితహారానికి మొక్కలు సిద్ధం
వాంకిడి నర్సరీలో పెంచుతున్న మొక్కలు

- ఎనిమిదో విడత లక్ష్యం 6లక్షల మొక్కలు

- మొక్కలు నాటేందుకు అధికారుల ప్రణాళికలు

వాంకిడి, మే 25: ఏటా హరితహారంలో నాటుతున్న మొక్కలు పెరిగి వృక్షాలుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదో విడత హరితహారానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో మండలంలో 6లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మండలంలోని 28గ్రామపంచాయతీల్లో మొక్కలు పెంచేం దుకు 28నర్సరీలను ఏర్పాటు చేశారు. వాంకిడి నర్సరీలో లక్ష మొక్కలు పెంచుతుండగా మిగితా 27నర్సరీల్లో 5లక్షల మొక్కలు పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్క లను కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. 

- ప్రణాళికలు సిద్ధం..

షాకిర్‌ ఉస్మానియా- ఏపీవో, ఈజీస్‌ 

మండలంలోని 28నర్సరీల్లో 6లక్షల మొక్కలు పెంచేం దుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో 6లక్షల  మొక్క లు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం.  ఇందుకు ప్రణాళి కలు కూడా సిద్ధం చేస్తున్నాం. ఎనిమిదో విడత హరిత హారంలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలను రూపొందిస్తున్నాం.

Updated Date - 2022-05-26T04:04:51+05:30 IST