Abn logo
Apr 12 2021 @ 23:13PM

కొవిడ్‌ కేర్‌ సెంటర్లను సిద్ధం చేయండి


కొవిడ్‌ కేర్‌ సెంటర్లను సిద్ధం చేయండి

జేసీ మహేష్‌కుమార్‌

కలెక్టరేట్‌: కొవిడ్‌ కేర్‌ సెంటర్లను సిద్ధం చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ నెల 15 నాటికి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు అందుబాటులోకి తేవాలన్నారు. తొలివిడతగా విజయనగరంలోని గిరిజన భవన్‌, గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వంద పడకలకు తక్కువగా కాకుండా చూడాలన్నారు.  విజయనగరంలో అదనంగా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన భవనాలను అన్వేషించాలని సూచించారు. అవసరమైతే కల్యాణ మండపాలను కూడా పరిశీలించాలని చెప్పారు. ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్‌ సౌకర్యం ఉండాలన్నారు. ఈ కేంద్రాల్లో భోజన ఏర్పాట్లను తహసీల్దారులు, పారిశుధ్య నిర్వహణ, కంప్యూటర్లు , ఆపరేటర్ల సరఫరాను ఎంపీడీవోలు, వైద్య పరమైన ఏర్పాట్లను జిల్లా వైద్యాధికారి చూడాలన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అత్యవసర వైద్యసేవలందించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. గుర్తించిన కొవిడ్‌ ఆసుపత్రుల్లో బాధితులకు ఆరోగ్యశ్రీ నిబంధనలు అనుసరించి ఆహారం, మందులు, ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు. వైద్యసేవలు, ఆహార సరఫరా తదితర వాటి పర్యవేక్షణకు ప్రతి ఆస్పత్రికి ఒక నోడల్‌ బృందాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రెవెన్యూ, మెడికల్‌, నాన్‌ మెడికల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన బృందం అన్ని ఆసుపత్రులు తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రి వద్ద 24 గంటలు పని చేసే హెల్ప్‌ డెస్క్‌లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ వెంకటరావు, ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌, డీపీవో సునీల్‌ రాజకుమార్‌, డీఎంహెచ్‌వో రమణకుమారి పాల్గొన్నారు.


370 పాఠశాలలకు కరోనా కిట్లు

 జిల్లాలో 370 పాఠశాలల్లో కరోనా కిట్లు పంపిణీ చేయనున్నట్టు జేసీ కిషోర్‌కుమార్‌ తెలిపారు. సోమవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అందించిన కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జేసీ వివరించారు. ఈ కిట్‌లో ఽథర్మల్‌ స్కానర్‌, పల్స్‌ అక్సీమీటర్‌, థర్మామీటర్‌తో పాటు శానిటైజర్‌, మాస్క్‌లు, గ్లౌజులు, పేస్‌ షీల్డ్‌ తదితర సామగ్రి ఉంటాయన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్‌ పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement