వ్యాక్సిన్‌ నిల్వకు సిద్ధం

ABN , First Publish Date - 2020-12-06T04:44:47+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు.

వ్యాక్సిన్‌ నిల్వకు సిద్ధం
మాట్లాడుతున్న కలెక్టరు హరి జవహర్లలాల్‌

పక్కాగా ఏర్పాట్లు చేయండి

 రెండో దశ కేసులు రాకుండా చూద్దాం

 కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌; డిసెంబరు 5:

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ  సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ను 48 రోజులు నిలువరించి గ్రీన్‌జోన్‌లో నిలిచిన మన జిల్లాకు ప్రత్యేక ఉందని గుర్తు చేశారు. రెండో దశలో కూడా కేసులు లేకుండా... ఒక్క మరణమూ సంభవించకుండా చూడడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందికి కొవిడ్‌ సోకకుండా చేపట్టాల్సిన 15 ఆంశాలను తెలుసుకునేలా చూడాలన్నారు. ప్రజలందరిలో అవగాహన కలిగించాలని చెప్పారు. జేసీ మహేష్‌ కుమార్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ పంపిణీకి పక్కా వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ భవాని మాట్లాడుతూ ఈనెల 22న వ్యాక్సిన్‌ మేనేజ్‌మెంట్‌పై జిల్లా స్థాయి రిసోర్స్‌ పర్సన్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. జిల్లా వైద్యాధికారి రమణకుమారి మాట్లాడుతూ జిల్లాలో 90 కోల్డ్‌ చెయిస్‌ పాయింట్లు, 231 నిల్వ పరికరాలతో పాటు 3,909 మంది  ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో మరో జేసీ కిషోర్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, డీఆర్‌వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

నీరుంటే క్షేమం... లేకుంటే క్షామం 

నీరే జీవనాధారమని.. నీరున్న ప్రదేశాలు మాత్రమే క్షేమంగా ఉంటాయని భావించి జిల్లాలో జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చెప్పారు. జాతీయ జలశక్తి శాఖ అధ్వర్యంలో వాన నీటి పరిరక్షణపై కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లతో శనివారం జాతీయ స్థాయి వెబినార్‌ జరిగింది. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వర్షపునీటిని సంరక్షించి, భూగర్బ జాలాలను పెంచడానికి చెరువుల శుద్ధి కార్యక్రమం చేపట్టామని వివరించారు. 


Updated Date - 2020-12-06T04:44:47+05:30 IST