వజ్రోత్సవాలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-08-15T08:03:04+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా వజ్రోత్సవాలకు చిత్తూరు సిద్ధమైంది.

వజ్రోత్సవాలకు సిద్ధం
స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమవుతున్న పోలీసు పరేడ్‌ మైదానం

పంద్రాగస్టు వేడుకలకు 19 శకటాల ఏర్పాటు


చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 14: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా వజ్రోత్సవాలకు చిత్తూరు సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగే తొలి జెండా పండుగ ఇదే. సోమవారం జరిగే ఈ వేడుకలకు పోలీసు పరేడ్‌ మైదానం సిద్ధమైంది. ఇక్కడి ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్వో ఎన్‌.రాజశేఖర్‌తో కలిసి కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు.ఏర్పాట్లలో స్వల్ప మా ర్పులకు సూచనలిచ్చారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం ఉదయం 9.10 గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు. జిల్లాలో వివిధశాఖల అభివృద్ధిని ప్రతిబింబించేలా 19 శకటాలను, 11 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రముఖులు, స్వాతంత్య్రసమరయోధులు, మహిళలు, పాత్రికేయులకు వేర్వేరుగా సీటింగ్‌ అరేంజ్‌మెంట్లు చేయాలని సూచించా రు. దేశభక్తి పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. కలెక్టర్‌ వెంట ఇంకా ఆర్డీవో రేణుక, తహసీల్దార్‌ పార్వతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-15T08:03:04+05:30 IST