ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-10-13T04:42:27+05:30 IST

జిల్లాలో ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వానాకాలం వరి పంట కోతకు వస్తుండడంతో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన రెండు సీజన్‌ల మాదిరిగానే ఈ దఫా కూడా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. వరి విస్తీర్ణం ఆధా రంగా అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన గన్నీ బ్యాగులను సమకూర్చుతున్నారు. ధాన్యం సేకరణ కు అవసరమైన కూలీలు, హమాలీలు, వాహనాల ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశా లు వెలువడగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం

జిల్లాలో ఈ వానాకాలంలో 3లక్షల 70వేల ఎకరాలలో సాగైన వరి

జిల్లా వ్యాప్తంగా 428 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల నిర్ణయం

నిజామాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వానాకాలం వరి పంట కోతకు వస్తుండడంతో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన రెండు సీజన్‌ల మాదిరిగానే ఈ దఫా కూడా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. వరి విస్తీర్ణం ఆధా రంగా అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన గన్నీ బ్యాగులను సమకూర్చుతున్నారు. ధాన్యం సేకరణ కు అవసరమైన కూలీలు, హమాలీలు, వాహనాల ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశా లు వెలువడగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో ఈ వానాకాలంలో 3లక్షల 70వేల ఎకరాల వరకు వరి సాగైంది. జిల్లాలోని అన్ని మండలాల ప రిధిలో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ సీజ న్‌లో సుమారు 9లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధా న్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సన్న, దొ డ్డు రకాలతో పాటు విత్తనోత్పత్తికి సంబంధించిన ర కాలను రైతులు సాగుచేశారు. సన్న రకాలను ఎక్కు వగా బయటనే రైతులు అమ్మకాలు చేస్తున్నా.. దొడ్డు రకాలను ఎక్కువగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తు న్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో పెంచిన మద్దతు ధరకు అనుగుణంగా కొనుగోలు చేసేందుకు అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈసారి మొత్తం 428 కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 352 కేంద్రా లు, ఐకేపీ ద్వారా 42 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 19 కేంద్రాలు, మార్కెట్‌ కమిటీల ద్వారా 8 కేంద్రాలు, మెప్మా ద్వారా 6 కేంద్రాలు, హాకా ద్వారా ఒక కేంద్రా న్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడగానే కొనుగోలు చేసేవిధం గా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

పెంచిన మద్దతు ధరకే కొనుగోళ్లు

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే మ ద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణరకాన్ని క్వింటాలు 1,940 రూపాయ లకు, ఏ గ్రేడ్‌ రకాన్ని 1,960 రూపాయలకు కొనుగో లు చేయనున్నారు. జిల్లాలో ప్రతీ సీజన్‌లో రెండు నె లల పాటు ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. బోధన్‌ డి విజన్‌ పరిధిలో మొదట ధాన్యం వస్తుంది. ఈ డివిజ న్‌ పరిధిలోని వర్ని, రుద్రూర్‌, కోటగిరి, బోధన్‌, ఎడప ల్లి మండలాలకు చెందినవారు ఎక్కువగా ధాన్యాన్ని ప్రైవేటులో అమ్మకాలు చేస్తున్నారు. ప్రతీ సీజన్‌లో పొలాల వద్దనే వచ్చిన రేటుకు వ్యాపారులకు అమ్ము తున్నారు. గడిచిన పది రోజులుగా వర్ని, ఎడపల్లి మ ండలాల పరిధిలో గంగా కావేరి రకాన్ని కోస్తున్న రై తులు క్వింటాలు రూ.1,500ల నుంచి రూ.1,600ల మ ధ్య అమ్మకాలు చేస్తునారు. ధాన్యాన్ని ఆరబోయకుం డా కోసిన రోజే వ్యాపారులకు అప్పజెబుతున్నారు. కొ నుగోలు కేంద్రానికి తీసుకొస్తే తేమశాతం తక్కువగా ఉండడం.. ఆరబోసి తీసుకురావాల్సి ఉండడంతో ము ందస్తుగా వచ్చిన రేటుకే అమ్మేస్తున్నారు.

89 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు సిద్ధం 

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కావాల్సిన గన్నీ బ్యా గులను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీజన్‌లో ఎక్కువ మొత్తంలో గన్నీ బ్యాగులు కావాల్సి ఉండ డంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కలకత్తాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గన్నీ బ్యాగులను తెప్పిస్తున్నారు. సీజన్‌ మొదలైన తర్వాత గన్నీ బ్యాగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 2 కోట్ల గన్నీలు అ వసరం కాగా.. ప్రస్తుతం 89లక్షలకుపైగా నిల్వ ఉం చారు. మిగతా వాటిని తెప్పించేందుకు ఏర్పాట్లు చే స్తున్నారు. గన్నీలతో పాటు హమాలీల కొరత లేకుం డా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాతో పాటు బీహార్‌, యూపీ, ఒరిస్సాకు చెందిన హమాలీలను వినియోగి ంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన టార్పాలిన్‌లు, ఇతర సామగ్రిని సమకూరుస్తున్నారు. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఈ సీజన్‌లో ధాన్యం సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌ తెలిపారు. సీజన్‌ దగ్గరపడుతుండడంతో ముందస్తుఏర్పా ట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు. ధాన్యం కొనుగోలు కు ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే జిల్లాలో కేంద్రాల ను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.

Updated Date - 2021-10-13T04:42:27+05:30 IST