కౌంటింగ్‌కు సిద్ధం

ABN , First Publish Date - 2021-09-19T04:11:58+05:30 IST

పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనున్నారు.

కౌంటింగ్‌కు సిద్ధం
ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

ఆత్మకూరు, సెప్టెంబరు 18: పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనున్నారు.  ఆత్మకూరు సబ్‌డివిజన పరిధిలోని ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఆత్మకూరులో మొత్తం 10ఎంపీటీసీ స్థానాలకు గానూ 7స్థానాలు ఏకగ్రీవమవ్వగా మిగిలిన 3స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే వెలుగోడు మండలంలో 14ఎంపీటీసీ స్థానాలకు గానూ 8స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 6స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కొత్తపల్లి మండలంలోని మొత్తం 9ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  వీటి లెక్కింపునకు సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని ఆయా గదుల్లో ఎన్నికల అధికారుల తగిన ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ అధికారులు సైతం తమ శాఖ ద్వారా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సదుపాయాలను కల్పిస్తున్నారు. కాగా కౌంటింగ్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఏర్పాట్లను పరిశీలించిన శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి : 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఆత్మకూరు స్ర్టాంగ్‌ రూమ్‌ ప్రత్యేక అధికారి, శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి కౌంటింగ్‌ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఇదిలావుంటే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, అసిస్టెంట్‌లకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 

- ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగానే కౌంటింగ్‌ కేంద్రమైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద పోలీసులు ఆదివారం పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సంగమేశ్వరం సర్కిల్‌, గౌడ్‌సెంటర్‌, అప్పారావువీధుల నుంచి పాతబస్టాండ్‌ వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని ఎస్‌ఐ హరిప్రసాద్‌ పేర్కొన్నారు. 

నందికొట్కూరు: ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  నియోజకవర్గంలోని నందికొట్కూరు, పగిడ్యాల, మిడుతూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తల్లి మండలాల్లో 65 ఎమ్పీటీసీ, ఆరు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నందికొట్కూరు, పగిడ్యాల, పాముల పాడు మండలాల ఓట్ల లెక్కింపు నందికొట్కూరు ప్రభత్వ డిగ్రీ కళాశాలలో, మిడుతూరు, జూపాడుబగ్లా మండలాల ఓట్ల లెక్కింపు కర్నూలు సెయింట్‌ జోషప్‌ డిగ్రీ కళాశాలలో, కొత్తపల్లి మండలం ఓట్ల లెక్కింపును ఆత్మకూరులో చేపడుతున్నారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ర్టాంగ్‌ రూమ్‌, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సామున్‌ పరిశీలించారు. 

బండి ఆత్మకూరు: నిబంధనల ప్రకారం ఎంపీటీసీ,  జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు చేపట్టాలని మండల రిటర్నింగ్‌ అధికారి రాజశేఖర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వాసుదేవగుప్త సూచించారు. శనివారం బండిఆత్మకూరు మండల పరిషత కార్యాలయంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు శిక్షణ నిర్వహించారు. అనంతరం ట్రైనీలు జాకీర్‌, చక్రపాణి కౌంటింగ్‌ నిర ్వహణపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌, పరిపాలన అధికారి హనీ్‌ఫఖాన పాల్గొన్నారు.

సంజామల: మండల పరిషత ఎన్నికల ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లకు ప్రొజెక్టర్‌ ద్వారా వీడియో ప్రదర్శించి శనివారం శిక్షణ నిర్వహించారు. సంజామల స్ర్తీ శక్తి భవనంలో ప్రత్యేకాధికారి మోహనరావు, ఎంపీడీవో నాగకుమార్‌, తహసీల్దారు మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో మండలంలోని 26 మంది సూపర్‌వైజర్లకు మాస్టర్‌ ట్రైనర్‌ మేడా హరిప్రసాద్‌ శిక్షణ ఇచ్చారు.  

పాములపాడు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని మండల ఎన్నికల ఆర్వో మహబూబ్‌ బాషా,(మండల స్పెషల్‌ ఆఫీసర్‌)  అసిస్టెంట్‌ ఆర్వోలు, ఎంపీడీవో రాణెమ్మ, తహసీల్దార్‌ వేణుగోపాలరావు అన్నారు.    22 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లకు కౌంటింగ్‌లో పాటించాల్సిన పద్ధతులపై, ఓట్ల లెక్కింపులో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిక్లరేషన లాంటి అంశాలపై శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు.  

కొత్తపల్లి: కొత్తపల్లి మండలంలోని ఎంపీటీసీ ,జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి భవాని శంకర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాయంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ఓట్ల లెక్కింపుకు 28 టేబుళ్ళు ఏర్పాటు చేసి, 115 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌ ,తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఈవోఆరీ శ్రీనివాస నాయుడు, దుద్యాల హెచఎం అయ్యుబ్‌ అహ్మద్‌  ఉన్నారు.


Updated Date - 2021-09-19T04:11:58+05:30 IST