కొవిడ్‌ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2020-09-24T07:05:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ పద్దుల కింద కొవిడ్‌-19 నుంచి మూడునెలల్లో రూ.7వేల కోట్ల పైచిలుకు నిధులు ఇచ్చిందని..

కొవిడ్‌ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం

కేంద్రం రూ. 7 వేల కోట్లు ఇచ్చింది నిరూపిస్తాం   

మేయర్‌ సునీల్‌రావుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ’బాస’ ప్రతిసవాల్‌ 


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 23: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ పద్దుల కింద కొవిడ్‌-19 నుంచి మూడునెలల్లో రూ.7వేల కోట్ల పైచిలుకు నిధులు ఇచ్చిందని.. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని నగర మేయర్‌ వై.సునీల్‌ రావుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు ప్రతిసవాల్‌ విసిరారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి రూ.7  వేలు కోట్లు ఇవ్వ లేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అబద్దాలకు అంబాసిడర్‌గా మారారంటూ మేయర్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత మూడు నెలల్లో కేంద్రం రాష్ట్రా నికి వివిధ పద్దుల కింద ఇచ్చిన ఏడు వేల కోట్ల పైచిలుకు నిధులు జాబితాను చూపిస్తామని, 290.29 కోట్లను కోవిడ్‌ కోసం ఖర్చు చేయాలని కేంద్రం ఇస్తే వాటిని కూడా ఖర్చుచేయలేని దుస్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందని ఆరోపిం చారు. నగరపాలక సంస్థ ఆరునెలల్లో అవినీతిమయంగా మారిందని, మొన్న పట్టణప్రగతిలో రూ. 30 లక్షల అవినీతి, నేడు రూ. 50 లక్షల రెవెన్యూ విభా గంలో అవినీతి జరిగిందని అవినీతిపై విచారణ జరిపిస్తామని కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.


అవినీతిని అరికట్టడంలో మేయర్‌ విఫలమయ్యారని ఆరోపించారు. ఆరునెలల మీ పాలనలో ఎన్ని రోడ్లు, డ్రైనేజీలు వేశారో చెప్పాలని, 24 గంటల నీటి సరఫరా ఏమైందని ఆయన ప్రశ్నించారు. మంత్రి, కలెక్టర్‌తో కలిసి పర్యటిస్తూ ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప ప్రజలకు నగరపాలక పక్షాన చేసిందేమీ లేదని విమర్శించారు. వీటిని పట్టించుకోకుండా ఎంపీపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబమని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని లేనిపక్షంలో ఎక్కడికక్కడ అవినీతిని అడ్డుకొని తీరు తామని బాస హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ రాష్ట్రమంతటా తిరుగుతుంటే టీఆర్‌ఎస్‌ మంత్రులకు కనిపించడం లేదని శ్రీనివాస్‌యాదవ్‌ చేసిన ఆరోపణలను ఖండించారు.


కరోనాబారిన పడి ప్రజలు ఇబ్బందులు పడు తుంటే సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారని, ఎన్ని హాస్పిటల్‌ తిరి గారని, ఎంత మంది బాధితులను పరామర్శించారో చెప్పాలని నిలదీశారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌పై అక్కడి ప్రజలకు, ఆ పార్టీ నాయకులకు విశ్వా సం పోయిందని మొన్నటి చొప్పదండి మున్సిపల్‌  కో అప్షన్‌ ఎన్నికల్లో ఆయన సూచించిన అభ్యర్థులను ఓడించినపుడే తెలిసిందని, ఆయనకు ఎంపీని విమర్శిం చే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మేయర్‌ డి.శంకర్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, సీనియర్‌ కార్పొరేటర్‌ రాపర్తి విజయ, నాయకులు శివరామయ్య, కన్నబోయిన ఓదెలు, కార్పొరేటర్లు అనూప్‌, జయశ్రీ, శ్రీనివాస్‌, కచ్చు రవి, జయలక్ష్మి, జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:05:38+05:30 IST