వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T05:18:37+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ కోసం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. శుక్ర వారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శరత్‌

 కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డిటౌన్‌, జనవరి 15: కరోనా వ్యాక్సినేషన్‌ కోసం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. శుక్ర వారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దపాలో వైద్య, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేస్తారన్నారు. ప్రతీ కేంద్రంలో 50 మందికి వ్యాక్సినేషన్‌ చేయడానికి వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రంలో వ్యాక్సినేషన్‌ తర్వాత 30 నిమిషాలపాటు పరిశీలనలో ఉంచాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, స్థానిక సంస్థల కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఆర్డీవో శ్రీను, డీఎం హెచ్‌వో చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి కమిషనర్‌ వేతనం నుంచి ఆసరా పింఛన్‌ డబ్బులు రికవరీ చేయాలి

ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ వేతనం నుంచి ఆసరా ఫించన్ల డబ్బులు రికవరీ చేయాలని కలెక్టర్‌ శరత్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎల్లారెడ్డి కమిషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 33మంది ఆసరా ఫించన్లు రద్ధయినట్లు గుర్తించామని, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను తొలగించినట్లు తెలిపారు. మూడు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటేడ్‌ వెజిటెబుల్‌ మార్కెట్‌ కోసం స్థలం ఎంపిక చేయాలని కమిషనర్లను ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు కూలీలు అధికంగా వచ్చేవిధంగా చూడాలన్నారు. శ్మశాన వాటికలు త్వరితగతినా పూర్తి చేయాలన్నారు.

బ్యాంకు లింకేజీ రుణాలు ఈనెల 25లోపు వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. స్త్రీనిధి రుణాల వసూలు చేపట్టాలని, కొత్తగా సహయక సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వీధి వ్యాపారులకు రుణాల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ రుణాల లక్ష్యం మేరకు చెల్లించాలన్నారు.

అవెన్యూప్లాంటేషన్‌లోని మొక్కల పరిశీలన

పట్టణంలోని టెక్రియాల్‌ చౌరస్తా నుంచి హౌసింగ్‌బోర్డు వరకు గల అవెన్యూప్లాంటెషన్‌ మొక్కలను కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. నాటిన మొక్కల చుట్టూ పిచ్చిమొక్కలను తొలగించాలని మున్సిపల్‌ అ ధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపుల మొ క్కలు దగ్గర, దగ్గరగా నాటాలని సూచించారు. ఇంధిరాగాంధి స్టేడియం వద్ద మిషన్‌ భగీరఽథ పైప్‌లైన్‌ లికేజీ ఉండడంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా డివిజనల్‌ విద్యుత్‌శాఖ కార్యాలయం బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేరుతో ఉండటాన్ని గమ నించి తెలంగాణ రాష్ట్రం పేరుమీద సరిచేసి తిరిగి స్థాపించాలని ఎస్‌ఈ శేషారావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి కమిషనర్లతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌: కొవిడ్‌ టీకా పంపిణీ ఏర్పాట్లలో లోటుపాట్లను సరిచేసుకుని టీకా పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ శరత్‌ అఽధికారులకు సూచించారు. శుక్రవారం సదాశివనగర్‌ పీహెచ్‌సీలో టీకా వేయించుకోనున్న వారి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. టీకా పంపిణీ విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణను పరిశీలించి పచ్చదనం ఏర్పాటుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదిగిన మొక్కలను కొనుగొలు చేసిన నాటాలని చెప్పినా నర్సరీలో దొరికిన మొక్కలను కొనుగొలు చేసి నాటడంపై  మండిపడ్డారు. తమకు ఫించన్లు ఇవ్వడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోగా ఎందుకు దరఖాస్తులను తీసు కోవడం లేదని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో హజరుకావాలని ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే, తహసీల్దార్‌ రవీందర్‌, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, మేడికల్‌ ఆఫీసర్‌ ఇద్రిస్‌ఘోరి, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:18:37+05:30 IST