‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-23T04:37:47+05:30 IST

నేటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
అయిజ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్లతో సమావేశమైన చీఫ్‌ సూపరింటెండెంట్‌

- కేంద్రాలను పరిశీలించిన విద్యాధికారులు 



అయిజ, మే 22: నేటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం స్థానిక బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రానికి సంబంధించిన ఇన్విజిలేటర్ల తో చీఫ్‌ సూపరింటెండెంట్‌ నాగరాజు, డిపార్ట్‌మెం టల్‌ అధికారి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లు అనుసరించాల్సిన విధివిధానాల గురించి ఆయన వారికి వివరించారు. అయిజలో మొత్తం ఆరు కేంద్రాలు ఏర్పాటుచేశా మని, మొత్తం 990 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు ఎం ఈవో నర్సింహులు తెలిపారు. 

గట్టు: మండలంలోని మా చర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గట్టు ఉన్నత పాఠశాల, బాలికల గురుకుల పాఠశాలలో ‘పది’ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎంఈవో కొం డారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గట్టులోని ఆరు ఉన్నత పాఠశాలలు, రెండు ఎంపీహెచ్‌ఎస్‌, గట్టు బాలికల గురుకుల పాఠశాలతో పాటు, మానవపాడు గురుకుల పాఠశాల, కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు పరీక్షలు రాయనున్నారని ఎం ఈవో తెలిపారు. ఆలూరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ధరూర్‌ కేంద్రంలో పరీక్షలు రాయనున్నారన్నారు.

 ఉండవల్లి : మండల కేంద్రంలో మూడు ‘పది’ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎం ఈవో శివప్రసాద్‌ తెలిపారు. జడ్పీహెచ్‌ఎస్‌లో 168, ప్రాథమిక పాఠశాలలో 137, మైనారిటీ గురుకుల పాఠశాలలో 172 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు. ఆయా కేంద్రా లకు నిర్మలాజ్యోతి, వెంకటేశ్వర్లు, అమరేందర్‌రెడ్డి ముఖ్య పర్యవేక్షకులగా వ్యవహరిస్తారని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, వైద్యసేవలు అందుబాటు లో ఉంచినట్లు చెప్పారు. 

ఇటిక్యాల : మండలంలో పదో తరగతి పరీక్ష లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో రాజు తెలిపారు. మండలంలోని కొండేరు, ఇటిక్యాల, కోదండాపురంతో పాటు, కొత్తగా ఎర్రవల్లి చౌరస్తాలోని జ డ్పీ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 

 వడ్డేపల్లి : శాంతినగర్‌లో ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈవో నర్సింహ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతినగర్‌లో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 690 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు.  34మంది ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల పర్యవేక్షకు లుగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. 





Updated Date - 2022-05-23T04:37:47+05:30 IST