కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి
గణతంత్ర వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్
నల్లగొండ క్రైం, జనవరి 25: గణతంత్ర వేడుకలకు జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్, పోలీస్ జిల్లా కార్యాలయాలు వేడుకలు సిద్ధమయ్యాయి. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10గంటలకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అందుకోసం కలెక్టర్ కార్యాలయంతోపాటు పరిసరాలను సైతం ము స్తాబుచేశారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి జాతీయ జెండావిష్కరణ చేయనున్నారు. పోలీస్ కార్యాలయంలో కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసుల గౌరవవందనంతోపాటు వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు.