పదికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-23T07:08:43+05:30 IST

10వ తరగతి వార్షీక పరిక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 153 పరిక్ష కేంద్రా ల్లో పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా 22,436 మంది విద్యార్థులు పరిక్షలురాయనున్నారు. ఇందులో బాలురు 11,458 మందికాగా బాలికలు

పదికి సర్వం సిద్ధం
బోధన్‌లో ఏర్పాట్లపై మాట్లాడుతున్న డీఈవో

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు 

ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు

హాజరుకానున్న 22,436 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా మొత్తం 153 పరీక్ష కేంద్రాలు 

నిజామాబాద్‌ అర్బన్‌, మే 22: 10వ తరగతి వార్షీక పరిక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 153 పరిక్ష కేంద్రా ల్లో పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా 22,436 మంది విద్యార్థులు పరిక్షలురాయనున్నారు. ఇందులో బాలురు 11,458 మందికాగా బాలికలు 10,955 మంది ఉన్నారు. ఉదయం 9.30గంటల నుంచి 12.45 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులను 9.35 వరకు అంటే 5 నిమిషా లు ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకునిరావద్దని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

సిబ్బందికి సెల్‌ఫోన్‌ల అనుమతిలేదు

పేపర్‌ లీకేజీ వంటి అంశాలకు అవకాశం ఇవ్వకుండా ఈసారి పదో తరగతి పరీక్ష విధులు నిర్వహించే చీఫ్‌ సూపరిండెంట్‌లు, డి పార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్‌లు ఎవరైనా పరీక్ష కేం ద్రంలోకి సెల్‌ఫోన్‌లను తీసుకుని వెళ్లే అనుమతి లేదు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను ఓపెన్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. 153 పరీక్ష కేంద్రాల్లో అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు పరీ క్ష జరిగే సమయాలలో సమీపంలో ఉన్న జీరాక్స్‌ సెంటర్‌లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌, జిల్లావ్యాప్తంగా 7 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతీ పరీక్ష గదిలో ఫ్యాన్‌లు, విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి వసతితో పాటు పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఫిర్యాదుల కోసం ఫోన్‌ నెంబర్ల ఏర్పాటు

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదులు ఉంటే డీఈవో ఫోన్‌ నెం.7995087611, అలాగే, కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెం.9030282993 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేదన్నారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

బోధన్‌ రూరల్‌: నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గప్రసాద్‌ అన్నారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఆదివారం బోధన్‌లోని అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతీ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష సెంటర్‌ సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌ పాల్పకుండా పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బోధన్‌ విద్యాశాఖాధికారి శాంతకుమారి, తదితరులున్నారు. 

Updated Date - 2022-05-23T07:08:43+05:30 IST