ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం!

ABN , First Publish Date - 2021-10-25T05:03:08+05:30 IST

జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశాం.. రైతులు ఇబ్బందిపడకుండా మద్దతు ఽధరకు కొ నుగోలు చేస్తాం.. ధాన్యం చేతికి వచ్చిన గ్రామాల్లో మొదట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.. ధాన్యం తూకంలో తేడా రాకుండా చర్యలు చేపట్టాం.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, కాంటాలు, తదితర సామగ్రిని సమకూర్చాం.. ఈసారి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మం డల స్థాయిలోనే ప్రత్యేక అధికారుల బృందాలను నియమి ంచామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో త్వర లో చేపట్టనున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఆంరఽధజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్‌ తెలిపారిలా..

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం!

జిల్లాలో ఈసారి 458 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం

తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం

ఎక్కడైనా తరుగుపేరిట కడ్తా తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

ధాన్యం తరలింపునకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి

నిజామాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశాం.. రైతులు ఇబ్బందిపడకుండా మద్దతు ఽధరకు కొ నుగోలు చేస్తాం.. ధాన్యం చేతికి వచ్చిన గ్రామాల్లో మొదట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.. ధాన్యం తూకంలో తేడా రాకుండా చర్యలు చేపట్టాం.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, కాంటాలు, తదితర సామగ్రిని సమకూర్చాం.. ఈసారి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మం డల స్థాయిలోనే ప్రత్యేక అధికారుల బృందాలను నియమి ంచామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో త్వర లో చేపట్టనున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఆంరఽధజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్‌ తెలిపారిలా..

ఆంధ్రజ్యోతి: జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి.. ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నారు?

కలెక్టర్‌: జిల్లాలో ఈ వానాకాలంలో వరి విస్తీర్ణం పెరిగి ంది. ఈ దఫా 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించాం. జిల్లాలో ప్రాథమిక సహకా ర సంఘాలు, ఐకేపీ, మెప్మా, మార్క్‌ఫెడ్‌, మార్కెట్‌ కమిటీ లు, ఇతర సంస్థల ద్వారా మొత్తం 458 కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లు చేశాం. జిల్లాలో గడిచిన మూడు రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.  

ఆంధ్రజ్యోతి: కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పా ట్లు చేశారు? మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నారా?   

కలెక్టర్‌: జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు పూర్తి ఏర్పాట్లు చేశాం. కొనుగోలుకు అవసరమై న గన్నీ బ్యాగులను సమకూర్చాం. వర్షాలు వచ్చినా ఇబ్బం దులు లేకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. ప్రతీ కేంద్రంలో తూకంలో తేడా రాకుండా మిషన్‌లను సమకూ ర్చాం. ధాన్యం చన్ని పట్టేందుకు కూడా ప్రతి ప్రాథమిక కేం ద్రం పరిధిలో యంత్రాలను ఏర్పాటు చేశాం. ధాన్యాన్ని తీ సుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేం ద్రాల్లో ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రంలో క్వింటాల్‌ ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని రూ.1,960కి, సాధారణ రకాన్ని రూ.1,940లకు కొ నుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులు తప్పనిసరి గా 17శాతం లోపు తేమ ఉండే విధంగా ధాన్యాన్ని ఆరబో సి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.

ఆంధ్రజ్యోతి: జిల్లాలో రైతులు పెద్దఎత్తున ధాన్యం తీ సుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రాల వద్దకు ఒకే సారి పెద్దమొత్తంలో ధాన్యం వస్తే ఇబ్బందులు ఏర్పడతా యి. ప్రత్యేక చర్యలు చేపట్టారా?

కలెక్టర్‌: జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే వరి కో తకు వచ్చింది. రైతులు జూన్‌ నెలలోనే సాగు చేయడంతో త్వరగా ధాన్యం చేతికి వచ్చింది. మొదట ధాన్యం చేతికి వ చ్చిన ప్రాంతాల్లోనే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే నెంబర్‌ల ఆధారంగా టోకెన్‌లు ఇవ్వడంతో పాటు నిర్ణయిం చిన తేదీల్లోనే ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు జరిగేవిధం గా ఏర్పాట్లు చేశాం. 

ఆంధ్రజ్యోతి: ప్రతీసీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసినా.. తరలింపునకు రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో వాహనాల సంఖ్యను పెంచుతున్నారా?

కలెక్టర్‌: ఈ సీజన్‌లో ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. గత సీజన్‌కన్నా ఈ సారి వా హనాల సంఖ్యను పెంచాం. గత సీజన్‌లో 800ల వాహనాలను ఉపయోగించగా.. ఈసారి 1200లకు పెంచాం. మం డలాల వారీగా ధాన్యం తరలింపు కోసం తహసీల్దార్‌ ఆధ్వ ర్యంలో ప్రత్యేక బృందాలను నియమించాం. ఈ బృందాల ఆధ్వర్యంలో ధాన్యాన్ని తరలించడంతో పాటు మిల్లర్ల వద్ద 12 గంటల కన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా వెంట నే అన్‌లోడింగ్‌ చేసేవిధంగా ఏర్పాట్లు చేశాం. ఈ దఫా ప్ర తీ కొనుగోలు కేంద్రంలో హమాలీల సంఖ్యను పెంచాం. 

ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఈసారి ఎన్ని రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు ?

కలెక్టర్‌: జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యానికి అనుగుణ ంగా ఈ దఫా 271 మిల్లులకు అనుమతులు ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన విధంగానే ఈ మిల్లులకు ధాన్యా న్ని ఇస్తున్నాం. త్వరగా బియ్యాన్ని ఇచ్చేవిధంగా అన్ని రా రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేశాం. యాసంగి లో మాదిరిగా కేవలం బాయిల్డ్‌ మిల్లులకు ఇవ్వకుండా అ న్ని మిల్లులకు కేటాయింపులు చేశాం. 

ఆంధ్రజ్యోతి: ప్రతీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు సమయంలో తూకంలో ఎక్కువ తరుగు తీయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ దఫా నిబంధనలకు విరుద్ధంగా కడ్తా తీయకుండా చర్యలు చేపడుతున్నారా?

కలెక్టర్‌: ఈ దఫా జిల్లాలో అన్ని కేంద్రాల్లో నిబంధనల కు విరుద్ధంగా కడ్తా తీయకుండా ప్రత్యేక చర్యలు చేపట్టా ం. ప్రతీ కొనుగోలు కేంద్రానికి రైతు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకువచ్చే విదంగా చూస్తున్నాం. అన్ని కొనుగో లు కేంద్రాల్లో కడ్తా తీయకుండా చర్యలు చేపట్టాం. ఈ ద ఫా కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకంలో తేడా రాకుండా ప్రత్యేక యాప్‌ను ఉపయోగిస్తున్నాం. కొనుగోలు కేంద్రంలో వేసిన తూకం ప్రకారం ట్రక్‌ షీట్‌లో నమోదు చేస్తున్నాం. ఈ యాప్‌ ద్వారా మిల్లర్లకు వెళ్లిన తర్వాత వివరాలు న మోదు చేస్తాం. ఎలాంటి తేడా రాకుండా రైతుల వారీగా ఈ యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేస్తున్నాం. కడ్తా తీస్తే కఠిన చర్యలు చేపడతాం. మిల్లర్లకు కూడా ముందుగానే ఆదేశాలు ఇచ్చాం. ప్రతి కేంద్రంలో తూకం వివరాలు లీగల్‌ అధికారులు పర్యవేక్షించేవిధంగా ఏర్పాట్లు చేశాం. 

ఆంధ్రజ్యోతి: ప్రతీ సీజన్‌లో చెల్లింపులలో తేడాలు వ స్తుండడంతో రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ దఫా ప్ర త్యేక చర్యలు ఏమైనా చేపట్టారా?

కలెక్టర్‌: కొనుగోలు కేంద్రంలో వేసిన తూకంకు అనుగుణంగానే చెల్లింపులు జరిగేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకు న్నాం. మండలస్థాయిలో ఈ దఫా ప్రత్యేక బృందాలను ని యమించాం. కొనుగోలు కేంద్రాల వారీగా వారు పర్యవేక్షించడంతో పాటు తూకం వివరాలు నమోదు చేస్తారు. ఏ సొసైటీ పరిధిలో కూడా రైతుకు తూకంలో తేడా వల్ల న ష్టం రాకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధాన్యం ఆరబోసి కేం ద్రాలకు తీసుకురావాలి. అందరి రైతుల ధాన్యం కొనుగోలు చేస్తాం. తేమశాతం తక్కువగా ఉంటే మద్దతు ధర రావడ ంతో పాటు తూకంలో తేడాలు రావు. రైతులు త్వరగా అ మ్ముకునేందుకు చూడకుండా ఆరబోసి తీసుకువస్తే ఇబ్బం దులు ఎదురుకావు. కొనుగోళ్లకు రైతులు సహకరించాలి.

Updated Date - 2021-10-25T05:03:08+05:30 IST