104 రైతు వేదికలు సిద్ధం

ABN , First Publish Date - 2020-10-31T06:28:08+05:30 IST

జిల్లాలోని గ్రామాల వారీగా రైతులు సాగుచేసే పంటలపై, చీడపీడల నుంచి రక్షించుకునేందుకు, పంటల దిగుబడులకు మద్ధతు ధరపై రైతులు చర్చించుకునేందుకు ఓ వేదిక నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం

104 రైతు వేదికలు సిద్ధం

కామారెడ్డి జిల్లాలో వందశాతం రైతు వేదికల నిర్మాణాలు

అన్ని హంగులతో రైతు వేదికలు సిద్ధం

రాష్టంలోనే నిర్మాణాల్లో కామారెడ్డి జిల్లా ప్రథమస్థానం

జిల్లా అధికారులను ప్రశంసించిన సీఎస్‌ సోమేష్‌కుమార్‌

జిలాల్లోని రైతు వేదికలను ప్రారంభించనున్న స్థానిక ప్రజాప్రతినిధులు


కామారెడ్డి, అక్టోబరు 30 (ఆంద్రజ్యోతి): జిల్లాలోని గ్రామాల వారీగా రైతులు సాగుచేసే పంటలపై, చీడపీడల నుంచి రక్షించుకునేందుకు, పంటల దిగుబడులకు మద్ధతు ధరపై రైతులు చర్చించుకునేందుకు ఓ వేదిక నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతువేదికల నిర్మాణా నికి శ్రీకారం చుట్టింది. గ్రామ వ్యవసాయ క్లస్టర్‌కు ఒక వేదికను నిర్మించాలని నిర్ణయించింది. కామా రెడ్డి జిల్లాలో కేవలం 3నెలల్లోనే నూటికి నూరు శాతం రైతు వేదికల నిర్మాణాలను పూర్తయ్యాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వేదిక ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోనే రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేసుకున్న మొద టి జిల్లాగా కామారెడ్డి నిలిచింది. స్వయంగా ప్ర భుత్వ చీప్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ వేదిక నిర్మా ణాల పనితీరుపై జిల్లా అధికారులను ప్రశంసించ డం ఇందుకు నిదర్శనం. ఆహ్లదకరమైన వాతవర ణంలో అన్ని హంగులతో జిల్లాలో 104 రైతు వేది కల భవనాల నిర్మాణాలను పూర్తి కావడంతో కా మారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అధికా రులను కలెక్టర్‌ ప్రశంసించారు.


ఒకేరోజు 104 వేదికలకు శంకుస్థాపన

జిల్లాలోని 104 రైతువేదికల నిర్మాణాలకు ఒకే రోజు శంకుస్థాపన చేపట్టారు. ఆగస్టు 2న జిల్లా లోని 4 నియోజకవర్గల పరిధిలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్‌, హన్మంత్‌షిండే, సురేం దర్‌ రైతు వేదికలకు భూమి పూజ చేసి శంకు స్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు ప్రారం భించి 15రోజులకే జిల్లాలోని బీర్కూర్‌ మండలం రైతు నగర్‌లో రైతు వేదిక భవన నిర్మాణం వంద శాతం అన్ని హంగులతో పూర్తి కావడమే ఇందు కు నిదర్శనం. రైతులకు ఎంతో ప్రయోజనం రైతు వేదిక భవనాల ద్వారా జరిగేందుకు ప్రభుత్వం భ వనాల నిర్మాణాలను మంజూరు చేసింది. ఒక్కో భవనం రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు మంజూరు చేసింది. ప్రతీ క్లస్టర్‌లో రైతు వేదిక భ వనాల్లోనే ఏఈవోలు ఉండేవిధంగా రైతులకు సల హలు సూచనలు అందించే విధంగా రైతు వేదిక భవనాలను నిర్మించారు. గ్రామంలోని రైతులు అందరూ కూర్చునేలా.. అధికారుల సమావేశాలు జరిపేటా రైతు వేదికలు నిర్మించారు.


మూడు నెలల్లోనే వేదికల నిర్మాణాలు పూర్తి

జిల్లాలో 104 రైతువేదికల నిర్మాణాలు మూడు నెలలోనే పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్‌ రైతు వేదికల నిర్మాణాలకు ప్రత్యేక చోరవ చూపడంతో జిల్లా కలెక్టర్‌  శరత్‌తో పాటు ఉన్నతాధికారులు, ఆయా నియోజక వర్గాల్లోని ప్రజాప్రతినిధులు సమీష్టిగా భవ న నిర్మాణాల పనులపై పర్యవేక్షణ చేస్తు పనులు శరవేగంగా సాగేలా చూసారు. త మ పరిధిలో రైతు వేదికల నిర్మాణాలు నెల రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. రైతు వేదిక భవనాల చుట్టూ అందంగా రెండు వరుసలల్లో మొక్కల పెంపకం, పచ్చదనం రూపొందించడం, మిషన్‌ భగరీఽథతో తాగునీటిని, విద్యుత్‌, టాయిలెట్స్‌ వసతులు కల్పించారు. అక్టో బర్‌లోగా రైతు వేదిక భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో కలెక్టర్‌ శరత్‌ మండల స్థాయి అధికారుల  నిర్ధేశించారు. దింతో జిల్లాలో 104 రైతు వేదికల భవన నిర్మాణాలు పూర్తయ్యా యి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో రైతు వేదికలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారం భించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-10-31T06:28:08+05:30 IST