వృద్ధికి ‘తయారీ’ కీలకం

ABN , First Publish Date - 2021-03-07T06:16:24+05:30 IST

ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తయారీ రంగం కీలకమని.. ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ప్రైవేటు వినియోగాన్ని పెంచాలని కార్పొరేట్‌ వర్గాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయి

వృద్ధికి ‘తయారీ’ కీలకం

  • మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
  • ప్రైవేటు వినియోగాన్ని పెంచాలి కార్పొరేట్ల మనోగతం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తయారీ రంగం కీలకమని.. ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ప్రైవేటు వినియోగాన్ని పెంచాలని కార్పొరేట్‌ వర్గాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయి ఉత్పాదకతను సాధించడానికి మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కోటక్‌ మహీంద్రా బ్యాంకు చీఫ్‌, సీఐఐ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కోటక్‌ తెలిపారు. సీఐఐ దక్షిణ ప్రాంత చాప్టర్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. వృద్ధి రేటును పెంచడానికి ప్రైవేటు వినియోగాన్ని పెంచాలని, జీడీపీలో దాదాపు 60  శాతం వాటా ప్రైవేటు వినియోగానిదేనని సీఐఐ, సదరన్‌ రీజియన్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే ప్రైవేటు వినియోగాన్ని పెంచగలమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌, డిజిటల్‌ టెక్నాలజీలు పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాల్లో అనేక మార్పులు తీసుకువచ్చాని సతీశ్‌ రెడ్డి అన్నారు. సీఐఐ మాజీ ప్రెసిడెంట్‌, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభనా కామినేని మాట్లాడుతూ.. పోయిన  ఉద్యోగాలను మళ్లీ తీసుకురావడం ఎలా అన్నదే అతిపెద్ద సవాలని అన్నారు. 

Updated Date - 2021-03-07T06:16:24+05:30 IST