Abn logo
Jan 25 2021 @ 01:17AM

శివరాత్రికి శ్రీకారం

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు 14రీల్స్‌ ప్లస్‌ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. కిశోర్‌ బి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘గ్రామీణం, వ్యవసాయం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటివరకూ చేయని విభిన్న పాత్రలో శర్వానంద్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘బలేగుంది బాలా’’, ‘సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే’ పాటలకు చక్కని స్పందన వచ్చింది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం, బుర్రా సాయిమాధవ్‌ మాటలు, జె. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement